హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

t pcc chief race: నేను కూడా.. హస్తినలో కసరత్తు, మధుయాష్కీ గౌడ్

|
Google Oneindia TeluguNews

టీ పీసీసీ చీఫ్ మార్పు అంశం ఊరిస్తోంది. ఆశవాహులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. రేపు, మాపు అని చెప్పి హైకమాండ్ కాలం వెళ్లదీస్తోంది. కానీ ఆశ పెట్టుకున్న వారు మాత్రం గంపెడాశతో వేచి చూస్తున్నారు. తొలుత రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు వినిపించాయి. షబ్బీర్ అలీకి కూడా కీలక పదవీ అని ప్రచారం జరిగింది. అప్పట్లో శ్రీధర్ బాబు పేరు కూడా వచ్చింది. జగ్గారెడ్డి నేను కూడా అని అంటున్నారు. తాజాగా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. తాను రేసులో ఉన్నానని ఆయనే మీడియాకు చెప్పారు.

Recommended Video

TPCC Chief: పక్కకు వెళ్లి మాట్లాడుకున్న Revanth Reddy - Komati Reddy పదవి ఎవరికి దక్కినా ?
రేసులో ఉన్నా: యాష్కీ

రేసులో ఉన్నా: యాష్కీ

టీపీసీసీ అధ్యక్షుడి రేసులో తాను కూడా ఉన్నానని నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ ప్రకటించారు. ఈ నెలలోనే పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన కసరత్తు ఢిల్లీలో జరుగుతోందని తెలిపారు. కానీ అందరూ ఊహించినట్టు అది ట్వంటీ ట్వంటీ స్థాయిలో లేదని ఆయన పేర్కొన్నారు. పీసీసీ పగ్గాలను బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు.

లాబీయింగ్..

లాబీయింగ్..


మధుయాష్కీ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయగలుగుతారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు. ఈ విషయం అందరికీ తెలుసు.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ లేకపోయినా.. ఆయన హవా నడుస్తోన్న సంగతి తెలిసిందే. నిజానికి తనకు పీసీసీ పదవీ కావాలని అడిగితే.. క్షణంలో మధుయాష్కీ అయిపోతారు. ఈ విషయం ఇతర నేతలకు కూడా తెలుసు. అందుకే ఎవరీ శక్తి మేరకు వారు లాబీయింగ్ చేస్తున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ పదవీ కాలం మాత్రం కంటిన్యూ అవుతూ వస్తోంది. మధుయాష్కీ హింట్‌తోనైనా కొలిక్కి వస్తుందో లేదో చూడాలీ మరీ.

ఆస్తుల రక్షణ కోసమేనట

ఆస్తుల రక్షణ కోసమేనట

పనిలో పనిగా ఈటల రాజేందర్ వ్యవహారంపై కూడా మధుయాష్కీ స్పందించారు. ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి ఈటల రాజేందర్ వెళుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే బీజేపీ మీద కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. జరిగే అంశాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు.

English summary
t pcc chief race: iam the frontliner for the top post madhu yaski goud said. he is close to rahul gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X