షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత మృతి.. గుండెపోటుతోనే..
షేక్‌పేట మాజీ తహసీల్దార్ సుజాత చనిపోయారు. అయితే ఆమె గుండెపోటుతో మరణించారని.. లేదు సూసైడ్ అనే కథనాలు వస్తున్నాయి. కానీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. గతకొంతకాలంగా సుజాత అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతిచెందారు. 2020 జూన్‌లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులు అరెస్టయిన విషయం తెలిసిందే. సుజాత జైలులో ఉండగానే అదే నెలలో ఆమె భర్త అజయ్ ఆత్మహత్య చేసుకున్నారు.
బంజారాహిల్స్‌లో కోట్ల రూపాయల విలువైన భూ వివాదం కేసులో ఆమె చిక్కుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ఓ భూ వివాదంలో లంచం ఆరోపణలపై తహసీల్దార్ సుజాతను 2020 జూన్ 8న పోలీసులు అరెస్టు చేశారు. ఖలీద్ అనే వ్యక్తి నుంచి ఆమె లంచం తీసుకున్నారని ఆధారాలు లభించడంతో పాటు, ఆమె ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీకి రూ.30 లక్షల నగదు, బంగారు ఆభరణాలు దొరికాయి. వాటికి సంబంధించి ఎమ్మార్వో సరైన ఆధారాలు చూపకపోవడంతో.. భూ వివాదం కేసు వ్యవహారంలో ఆమె పాత్రను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.

కోర్టు విచారణలో ఉన్న భూమిని ఖాలిద్ అనే వ్యక్తికి అనుకూలంగా రికార్డు తయారు చేసేందుకు లంచం తీసుకున్న ఆరోపణలతో ఏసీబీ ఆమెను విచారించింది. తర్వాత ఒకసారి ఆమె ఆత్మహత్యాయత్నం చేశారని సమాచారం. భార్యపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సుజాత భర్తను కూడా అప్పట్లో ఏసీబీ అధికారులు విచారించారు. 2020 జూన్‌లో సుజాత భర్త అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు.
ఏసీబీ వేధింపుల వల్లే అజయ్ ఆత్మహత్య చేసుకున్నారని అప్పట్లో కుటుంబీకులు ఆరోపించారు. సోదరి ఇంటి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి తీవ్రమైన మానసిక క్షోభతో సుజాత బాధపడుతున్నారు. మళ్లీ విధుల్లోకి చేరేందుకు అవకాశం ఇచ్చినా తిరస్కరించారు. డిప్రెషన్‌లోకి వెళ్లిన సుజాత.. ఆత్మహత్యకు పాల్పడినట్టు తొలుత ప్రచారం జరిగింది. ఆమె గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications