KCR సహా 18 మంది నేతలు.. లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం.. ఇక జైలుకే..
సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమ వ్యూహం తమకుందని తెలిపారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీలు చేసే విమర్శలు పట్టించుకోమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివరాలను పూర్తిగా సేకరించామని వివరించారు. టీఆర్ఎస్ 18 మంది ముఖ్యనేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని హాట్ కామెంట్స్ చేశారు.
తమ ఉద్యమ పంథానే వేరుగా ఉంటుందని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు పూర్తిగా తీస్తున్నామని ఇండికేషన్స్ ఇచ్చారు. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కేసుల పైనే ఆరా తీస్తున్నామని... ఈ స్కాంలు చూశాకే సీఎం కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయిందని వివరించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వారం రోజుల్లో బీజేపీలో చేరతారని స్పష్టంచేశారు. ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నార పేర్కొన్నారు.

ఈటల బీజేపీలో చేరేందుకు కొన్ని కండీషన్స్ పెట్టినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై బండి సంజయ్ స్పందించారు. ఎలాంటి హామీ లేకుండానే ఈటల బీజేపీలో చేరుతున్నారని వివరించారు. బీజేపీలో ఎవరు చేరినా.. ఎలాంటి హామీ ఉండదని తేల్చిచెప్పారు. బీజేపీ సిద్ధాంతాలతోపాటు ప్రధాని మోడీ పాలన నచ్చి ఈటల బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ మంచి వేదిక అని భావిస్తున్నారని వివరించారు. సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకించే వారికి బీజేపీ అండగా ఉండి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications