విషాదంలో జూ ఎన్టీఆర్ - విజయ సాయిరెడ్డి పరామర్శ..!!
తారకరత్న మరణంతో బాధలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ని విజయసాయిరెడ్డి పరామర్శించారు.
తారకరత్న మరణంలో జూనియర్ ఎన్టీఆర్ విషాదంలో ఉన్నారు. తారకరత్న బెంగుళూరు ఆస్పత్రిలో ఉన్న సమయంలో జూ ఎన్టీఆర్ తన సోదరుడు..కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పరామర్శించారు. ఆస్పత్రి లో తారకరత్న కోమాలో ఉండటం చూసి జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలోనే తారకరత్న సతీమణి.. కుమార్తెలను భరోసా ఇచ్చారు. ఇక..ఇప్పుడు తారకరత్న మరణంతో జూనియర్ షాక్ అయ్యారు. సోదరుడు కల్యాణరాంతో కలిసి తారకరత్న భౌతిక కాయానికి నివాళి అర్పించారు. విషాదంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ని విజయసాయిరెడ్డి పరామర్శించారు.
విషాదంలో జూనియర్ ఎన్టీఆర్ - కల్యాణ్ రాం
బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన తారకరత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్ లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. తారకరత్న మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. సినిమా ఎంటర్ టైన్ మెంట్ రంగాల్లో తారకరత్న రాణించారన్నారు. తారకరత్న కుటుంబ సభ్యులకు ప్రధాని సానుభూతి తెలిపారు.
పలువురు ప్రముఖులు తారకరత్న మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఇక, తారకరత్న నివాసానికి వైసీపీ నేత విజయ సాయిరెడ్డి చేరుకున్నారు. తారకరత్న సతీమణితో విజయ సాయిరెడ్డికి బంధుత్వం ఉంది. తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి సాయిరెడ్డి సతీమణి సోదరి కుమార్తె. తారకరత్న బెంగుళూరు ఆస్పత్రిలో ఉన్న సమయంలోనూ సాయిరెడ్డి పరామర్శించారు.

పరామర్శించిన విజయసాయిరెడ్డి
ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ వైద్య చికిత్స కోసం తీసుకుంటన్న చర్యలను..పడుతున్న తపనను సాయిరెడ్డి ప్రశంసించారు. ఆ తరువాత బాలకృష్ణతో ఫోన్ లో తారకరత్నకు అందించాల్సిన వైద్య చికిత్స గురించి చర్చించారు. ఈ ఉదయం తారకరత్న నివాసంలో సాయిరెడ్డి నివాళి అర్పిస్తున్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ అక్కడకు చేరుకున్నారు. తన సోదరుడిని చూడగానే ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ ఉద్వేగానికి లోనయ్యారు.
అక్కడే ఉన్న విజయ సాయిరెడ్డి ముందుగా కల్యాణ్ రాంను పలకరించారు. ఆ తరువాత ఆవేదనతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను పలకరించారు. తారకరత్నను అందిన వైద్య సేవలు..కోలుకుంటున్నారనే సమయంలో ఈ విధంగా జరగటం పైన ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేసారు.
తారకరత్నను చూడగానే ఒక్కసారిగా..
జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్నకు అందుతున్న చికిత్స గురించి నిరంతరం వాకబు చేసారు. జూ ఎన్టీఆర్ బెంగళూరు వెళ్లిన సమయంలో కర్ణాటక హెల్త్ మినిష్టర్ సుధాకర్ చికిత్స అందిస్తున్న వైద్యులతో చర్చించారు. విదేశీ వైద్యులను రప్పించటం పైన ఆరా తీసారు. తారకరత్న కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసారు.
కన్నడ నటుడు శివన్న కూడా ఆస్పత్రికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా తారకరత్నను పరామర్శించారు. ఇక.. ఇప్పుడు తారకరత్న మరణంతో ఒక్క సారిగా నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే కుటుంబ సభ్యులు తారకరత్న నివాసానికి చేరుకుంటున్నారు. రేపు తారకరత్న అంత్యక్రియలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications