హైదరాబాద్: ఆదివారం రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఈరోజు తొలిసారిగా పూర్తిస్థాయిలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొత్తం రూ.1.65 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇదిలా ఉంటే ఆర్థికశాఖ మంత్రిగా హరీష్ రావు కేసీఆర్ కేబినెట్‌లో చేరడంతో ఆయన తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌ను శాసనమండలిలో హరీష్ రావు ప్రవేశపెట్టనుండగా... శాసనసభలో మాత్రం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. అది ఆరునెలలకే పరిమితం కావడంతో ఈ సారి బడ్జెట్ పూర్తిస్తాయిలో ప్రవేశపెట్టారు.
ఆర్థికశాఖ మంత్రి వచ్చాక కూడా సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టడంపై ఒక్కింత ఆసక్తి నెలకొనడమే కాదు.. రాజకీయవర్గాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. దేశంలో ఆర్థికమాంద్యం నెలకొనడంతో వాస్తవాలకు దగ్గరగా ఈసారి బడ్జెట్ ఉండబోతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. కొన్ని అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు తగ్గినట్లు సమాచారం. వ్యవసాయ రంగం, సంక్షేమం,నీటిపారుదలకు పూర్తిస్థాయిలో కేటాయింపులు జరపనున్నట్లు సమాచారం.
Sep 09, 2019, 12:54 pm IST
ఆరోగ్యశ్రీకి రూ.1336 కోట్లు..త్వరలోనే వృద్ధాప్య పెన్షన్ వయసు 57ఏళ్లకు కుదింపు
Sep 09, 2019, 12:53 pm IST
గ్రామ పంచాయతీలకు రూ. 2714 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.1,764 కోట్లు
Chief Minister K. Chandrasekhar Rao will introduce the Budget for the 2019-20 financial year in the Assembly on Monday while Mr T. Harish Rao, sworn-in on Sunday and given the finance portfolio, will present it in the Legislative Council.The Cabinet which had met at Pragathi Bhavan here on Sunday evening under the leadership of Mr Chandrasekhar Rao, approved the Budget estimates.