హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నవంబర్ 2న తెలంగాణ క్యాబినెట్, ఆర్టీసీ అంశాలే ప్రధాన ఎజెండా

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఆర్టీసీ ప్రక్షాళనపై సీఎం కేసీఆర్ ముహుర్తం ఫిక్స్ చేశారు. ఆర్టీసీ ప్రత్యామ్నాలపై ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్ వాటిని అమోదించేందుకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఇందుకోసం నవంబర్ 2న సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కొనసాగనుంది. ఆర్టీసీ అంశంమే ప్రధాన ఎజెండాగా పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఆర్టీసీ సమ్మె చేపట్టి 27 రోజులు గడుస్తున్న కార్మికులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. విలీనం పై ఇరు వర్గాలు మెట్టు దిగకపోవడంతో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే కోర్టులో కూడ వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో సమస్య ఎటు తేలకుండా నానుతుంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆర్టీసీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్న నేపథ్యంలోనే అందుకు సంబంధించిన చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఆర్టీసీలో అద్దెబస్సులు ,ప్రైవేట్ బస్సులతో పాటు స్టేజ్ కేరియర్లు ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Telangana cabinet meeting will be held on november 2

ఈ నేపథ్యంలోనే యాబై శాతం మాత్రమే ఆర్టీసీ బస్సులను నడపాలని...మిగతా యాబైశాతం బస్సులను అద్దె బస్సులతో పాటు ఇతర ప్రైవేట్ వాహానాలు నడపాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వం ప్రవైట్ యాజమాన్యానికి అనుమతులు ఇచ్చేందుకు కసరత్తు చేసింది.

అయితే ఇవన్ని విధానపరమైన నిర్ణయాలు కావడంతో వాటిని కేబినెట్‌లో చర్చించి అమోదం తెలపనున్నారు. క్యాబినెట్ నిర్ణయం అనంతరం ఇక ఆర్టీసీలో సగం మేర ప్రైవేట్ బస్సులు తిరగనున్నాయి. అయితే ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఎలా స్పందిస్తుందదో వేచి చూడాలి.

English summary
Telangana cabinet meeting will be held on november 2.rtc strike will be the main agenda in the cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X