కొండగట్టుకు 14న సీఎం కేసీఆర్: రేపే అంజన్న ఆలయానికి ఆనంద్ సాయి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) ఫిబ్రవరి 14న జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం యాదాద్రి ఆలయ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి కొండగట్టుకు వెళ్లనున్నారు.
కొండగట్టు ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు ఆనంద్ సాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను జగిత్యాల ఎస్పీ భాస్కర్ పరిశీలించారు.

కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు
కాగా, జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులను బుధవారం విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆలయ అభివృద్ధికి నిధులను కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ఆగమశాస్త్రం ప్రకారం.. దేశంలోనే సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దనున్నారు.












Click it and Unblock the Notifications