యాదయ్య ఏం పాపం చేసిండు.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ

బీహర్ వెళ్లి అమర జవాన్ల కుటుంబాలను సీఎం కేసీఆర్ సాయం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దుమారం చెలరేగింది. నిన్న మల్లు రవి తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. ఇవాళ రేవంత్ రెడ్డి స్పందించారు. గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి చెక్కులు పంపిణీ చేశారు.

యాదయ్య సంగతి ఏంటీ..?

యాదయ్య సంగతి ఏంటీ..?

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లికి చెందిన అమర జవాను యాదయ్య కుటుంబాన్ని కేసీఆర్ మర్చిపోయారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీహార్ వెళ్లి అక్కడి అమర జవాన్ల కుటుంబాలకు మాత్రం పరిహారం పంచి వచ్చారని పేర్కొన్నారు. రాజ్యాధికార విస్తరణ కాంక్షా... లేక అమర జవాన్ల కుటుంబాల పట్ల సానుభూతా...? అనేది సమాజం ఆలోచించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

స్వార్థ రాజకీయాలు

జవాన్ల మరణాలను తెలంగాణ సీఎం కేసీఆర్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో అమర జవాన్ల కుటుంబాలు కేసీఆర్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు.

అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా తెలంగాణ ప్రజల సొమ్మును దేశమంతా పంచుతున్నారు. తెలంగాణలో అమరుడైన జవాన్ యాదయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. యాదయ్య కుటుంబానికి ఐదెకరాల పొలం, ఇంటి స్థలం, బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

మల్లు రవి ఇలా

మల్లు రవి ఇలా

ఇతర రాష్ట్రాల ఆర్మీ కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం చేస్తున్నారు. మరీ తెలంగాణ ఆర్మీ జవాన్ల కుటుంబాల సంగతి ఏంటీ అని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి నిన్న ప్రశ్నించారు. బీహార్ వెళ్లి.. అక్కడి అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారని.. తెలంగాణ రాష్ట్రంలో గల కొండారెడ్డిపల్లికి చెందిన సుమతమ్మ భర్త యాదయ్య ఆర్మీ ఆఫీసర్ అని గుర్తుచేశారు.

తొమ్మిదేళ్ల క్రితం డ్యూటీ‌లో చనిపోయారని.. 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ఆర్మీ కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేస్తోన్న సాయం గొప్పదే.. మరీ స్థానికుల సంగతి ఏంటీ అని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. ఇక్కడి వారికి కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు. మరీ దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+