నియోజకవర్గానికో బహిరంగ సభ, ప్రజల్లోకి విసృతంగా మేనిఫెస్టో, బహుముఖ వ్యుహంతో కాంగ్రెస్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అభ్యర్థుల కేటాయింపు ఆలస్యం కావడమే. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించారు. శుక్ర, శనివారాల్లో అభ్యర్థుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసి ప్రచార బరిలో నిలువాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది.

బహుముఖ కార్యాచరణలో ముందుకు ...

బహుముఖ కార్యాచరణలో ముందుకు ...

గత ఎన్నికల ఓటమికి గల కారణాలను అన్వేషించుకొని బహుముఖ కార్యాచరణతో ముందుకెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల నోటిఫికేషన్ లోపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది. దీంతో తమ ప్రచారానికి ఇబ్బందులు ఉండవని .. క్షేత్రస్థాయిలో క్యాంపెయిన్ చేయడానికి వీలవుతోందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో చేవెళ్ల నియోజకవర్గం శంషాబాద్ లో బహిరంగ సభతో ప్రచారం పర్వం మొదలైనందున .. మరో రెండు, మూడు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.

మూడు భారీ బహిరంగ సభలు

మూడు భారీ బహిరంగ సభలు

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ఉన్నందున .. కాంగ్రెస్ అధినేత రాహుల్ రాష్ట్రంలో పర్యటించేందుకు తక్కువ సమయం ఉంటోంది. ఈ నేపథ్యంలో రెండు, మూడు చోట్ల బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు యోచిస్తున్నారు. బహిరంగ సభలకు భారీగా జనాన్ని సమీకరించి .. ఓటుబ్యాంకుగా మలిచే ప్రయత్నం చేస్తామంటున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే .. రాహుల్ ప్రచార షెడ్యూల్ కన్ఫామవుతోందని చెప్తున్నారు.

ప్రజల్లోకి విసృతంగా మేనిఫెస్టో

ప్రజల్లోకి విసృతంగా మేనిఫెస్టో

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాలని .. ఇందుకోసం బహిరంగ సభలతోపాటు వివిధ రూపాల్లో ప్రచారం చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. వ్యవసాయ రుణాల మాఫీ, కనీస నికర ఆదాయం హామీ .. వివిధ ప్రధానాంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచి విసృతంగా క్యాంపెయిన్ చేస్తామని పేర్కొంటున్నారు.

నియోజకవర్గానికో బహిరంగ సభ

నియోజకవర్గానికో బహిరంగ సభ

రాష్ట్రంలోి 17 నియోజకవర్గాల్లో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామని టీపీసీసీ నేతలు తెలిపారు. ఈ సభల్లో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసేందుకు వేదికగా ఉపయోగించుకుంటారు. విభజన హామీలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ విఫలమైందని .. బీజేపీకి పరోక్షంగా టీఆర్ఎస్ మద్దతిస్తోందని ప్రధానంగా ప్రస్తావిస్తారు. లోక్ సభ నియోజకవర్గాల వారీగా పరిష్కారం కానీ సమస్యల జాబితాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఆయా అంశాలనే సభల్లో ప్రస్తావించి అధికార పార్టీలను ఇరుకున పెడుతామని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

డిఫరెంట్ గా ప్రచార అంశాలు

డిఫరెంట్ గా ప్రచార అంశాలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రచార అంశాలు కాకుండా .. విభిన్నంగా లోక్ సభ ఎన్నికలకు ప్రచారం అంశాలు ఉంటాయని టీపీసీసీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి పీసీసీ ఎన్నికల కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి నేతృత్వంలో ప్రచార కమిటీ సభలను సమన్వయం చేస్తోంది. భారీ రోడ్ షోలు కూడా నిర్వహిస్తామని ప్రచార కమిటీ స్పష్టంచేసింది. అభ్యర్థుల జాబితా పూర్తయ్యాక ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలంతా పాల్గొనేలా గాంధీభవన్ నుంచి పర్యవేస్తామని టీపీసీసీ స్పష్టంచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+