Hyderabad: భూముల వేలంతో రాష్ట్ర సర్కార్‍పై కాసుల వర్షం..
రాష్ట్ర ప్రభుత్వంపై భూములు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని కోకాపేట భూముల వందల కోట్లకు అమ్ముడు పోయాయి. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరం ధర రూ. 100 కోట్లు దాటింది. నియో పోలిస్ హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ. 35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధర నిర్ణయించింది. ఈ-వేలంలో బడా రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీ పడటంతో ధరలు అమాంతం పెరిగాయి.
అత్యధికంగా ఎకరం ధర రూ. 100.75 కోట్లు ఉండగా.. అత్యల్పంగా రూ. 51.75 కోట్లు పలికింది. గత గురువారం నిర్వహించిన రెండో దశ ఈ వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేశాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా బుద్వేల్ లో ప్రభుత్వ భూముల వేలంలో ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. ప్రభుత్వ ధర ఎకరం రూ.20 కోట్లుగా నిర్ణయిస్తే.. ఫస్ట్ సెషన్.. అంటే మధ్యాహ్నం వరకు జరిగిన వేలంలో ఎకరం అత్యధికంగా 30 కోట్ల రూపాయల వరకు వేలం పాట పాడారు.

కనిష్ఠంగా ధర రూ.25 కోట్లుగా ఉంది. ప్రభుత్వ ధరను మించి 10 కోట్ల రూపాయలు అదనంగా వచ్చాయి. కాగా రాష్ట్ర సర్కార్ వరుసగా భూములను విక్రయిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని భూములను వేలం వేస్తోంది. బుద్వేల్ లో అత్యధికంగా 5వ నెంబరు ఎకరం రూ.30 కోట్లు పలికింది. కనీస నిర్దేశిత ధర ఎకరం రూ.20 కోట్లతో వేలం పాట ప్రారంభమైంది. కోకాపేట లో ఎగబడి కోడ్ చేసిన బిడ్డర్లు.. బుద్వేల్ లో మాత్రం కాస్త వెనుకంజ వేశారు.
ప్రభుత్వం భూములు వేలం వేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇలా భూములు వేలం వేసుకుంటూ వెళ్తే.. భవిష్యత్ సర్కార్ భూములు ఉండవని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications