Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంపర్ ఆఫర్: ఈవీలు కొనుగోలు చేస్తే అవీ ఫ్రీ.. తెలంగాణ సర్కార్ ఆఫర్

పెట్రో ధరల మోత మోగడంతో ఎలక్ట్రిక్ వాహనాలపై పడ్డారు. టూ వీలర్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో కార్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో వేగంగా మార్పులు రావడం.. ఖర్చు తగ్గుతుండటంతో కొత్త వాహనాలు కొనాలి అనుకునే వారు వాటిపైనే దృష్టి సారిస్తున్నారు. దీంతో ప్రతి నెల ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగం పెరుగుదలకు ప్రభుత్వాలు కూడా హెల్ప్ చేస్తున్నాయి. పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరగడంతో, వాయుకాలుష్యం నానాటికి అధికం అవుతుండటంతో ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనీ ప్రజలకు సూచిస్తున్నాయి.

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరో ముందడుగు వేసి రాయితీలు ప్రకటిస్తున్నాయి. రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుపై మినహాయింపు ఇస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ తరహాలోనే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి రాయితీ ప్రకటించింది. రాష్ట్రాన్ని విద్యుత్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థకు కేంద్ర బిందువుగా మార్చేందుకు ప్రభుత్వం 'తెలంగాణ ఎలక్ట్రిక్‌ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030'ని రూపొందించింది. 2020లో ఈ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి, తయారీకి ప్రోత్సాహం, వ్యక్తిగత, వాణిజ్య రంగాల్లో రవాణా ఖర్చు తగ్గింపు, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పదేళ్ల పాటు కొత్త పాలసీ పనిచేస్తుంది.

 telangana government offer to buyers of electric vehicles

ఈ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. తొలి విడతలో తయారయ్యే రెండు లక్షల ద్విచక్ర వాహనాలు, 30 వేల ఆటో రిక్షాలు, 5వేల కార్లు 500 ఎలక్ట్రిక్‌ బస్సులకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ చార్జీ వంద శాతం ఉచితం. నిరుద్యోగులకు వెనుకబడిన వర్గాల వారికోసం మరో రాయితీ తెచ్చింది.. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగపడే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే స్వయం ఉపాధి పథకాల కింద ఆర్ధిక సాయం అందిస్తారు. ఇక వ్యవసాయంలో ప్రస్తుతం డీజిల్ తో నడిచే ట్రాక్టర్లే ఉన్నాయి. వీటితో వ్యవసాయం రైతులకు భారంగా మారింది. ఇక ఈ నేపథ్యంలోనే విద్యుత్‌ ట్రాక్టర్లకు రవాణా శాఖ నిబంధనలకు లోబడి వంద శాతం రోడ్‌ టాక్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తుంది.

నగరంలో డీజిల్, పెట్రోల్ వాహనాలను తగ్గించి, పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను నడపడం.. నగర నలుమూలల నుంచి హైదరాబాద్ మెట్రో స్టేషన్లకు బ్యాటరీ ఆధారిత వాహనాలు నడపడం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో దశల వారీ చార్జింగ్‌ స్టేషన్ల చేయడం. విద్యుత్‌ వాహనాలు, సంబంధిత పరికరాలు తయారు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం. రూ.200 కోట్ల పెట్టుబడి, వేయి మందికి ఉపాధి కల్పించే మెగా కంపెనీలకు 20శాతం పెట్టుబడి రాయితీ. ఏడేళ్ల పాటు ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్, ఐదేళ్ల పాటు గరిష్ఠ పరిమితి రూ.5 కోట్లు మించకుండా 25శాతం విద్యుత్‌ రాయితీ, ఐదేళ్ల పాటు విద్యుత్‌ సుంకం, స్టాంప్‌ డ్యూటీపై వంద శాతం రాయితీ ఇస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+