Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్న గవర్నర్..

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఖైరతాబాద్ బడా గణేషుడిని దర్శించుకున్నారు. నిర్వాహకులు, పూజారులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బడా గణనాథుడిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు వస్తున్నారు. ఉదయం ఖైరతాబాద్ గణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ చేశారు. మహా గణపతికి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు.

70 సంవత్సరాలు ఖైరతాబాద్ లో వినాయక ఉత్సవాలు జరపడం గొప్ప విషయమన్నారు. ఖైరతాబాద్ గణనాథుడు దేశంలోనే గొప్ప గుర్తింపు పొందరని అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రేవంత్ తెలిపారు. హైదరాబాద్‌లో 1లక్షా40వేల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారని వివరించారు. భక్తుల కోసం మండపాలకు ఉచిత కరెంట్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం భారీ వర్షాలతో
వరదలు వచ్చాయని గుర్తు చేశారు.

Telangana Governor Jishnu Sharma visited Khairatabad Ganasatha

దేవుడు దయ వల్ల భారీగా నష్టం జరగలేదని చెప్పారు. ఖైరతాబాద్ బడా గణేషుడిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు వస్తుండడంతో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ ఆంక్షాలు విధించారు. ట్యాంక్ బండ్ సమీపంలోని ఐమాక్స్ వద్ద వాహనాలు నిలిపి రావాలని కోరుతున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలోని రైల్వేగేటు నుంచి వాహనాలకు అనుమతి లేదన్నారు. నడుచుకుంటే వెళ్లే భక్తులను మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు.

ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వారు వాహనాలను ఐమాక్స్ పక్కన ఉన్న పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. మింట్ కాంపౌండ్ నుంచి వచ్చే భక్తులు వాహనాలను కారు రేసింగ్ ప్రాంతంలో పార్క్ చేసుకోవాలని కోరుతున్నారు. అలాగే ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ వద్ద కూడా పార్కింగ్ కు అవకాశం కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+