హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

6 దాటితే అంతే సంగతులు: టీఎస్ఆర్టీసీ సమ్మెపై మంత్రి అల్టిమేటం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలకు హెచ్చరిక జారీ చేశారు. శనివారం(అక్టోబర్ 5) సాయంత్రం 6 గంటల లోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని ఆయన స్పష్టం చేశారు.

'టీఎస్ఆర్టీసీ సమ్మెపై నిషేధం: విధులకు హాజరుకాకుంటే ఉద్యోగాలు పోగొట్టుకున్నట్లే''టీఎస్ఆర్టీసీ సమ్మెపై నిషేధం: విధులకు హాజరుకాకుంటే ఉద్యోగాలు పోగొట్టుకున్నట్లే'

టీఎస్ఆర్టీసీ సమ్మెతో ఏపీఎస్ఆర్టీసీకి కాసుల పంట .. మెట్రో నగరాల నుండి అదనపు సర్వీసులుటీఎస్ఆర్టీసీ సమ్మెతో ఏపీఎస్ఆర్టీసీకి కాసుల పంట .. మెట్రో నగరాల నుండి అదనపు సర్వీసులు

తీవ్ర హెచ్చరిక

తీవ్ర హెచ్చరిక

విధుల్లో చేరని పక్షంలో ఇకపై వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా ప్రభుత్వం పరిగణించదని మంత్రి తేల్చి చెప్పారు. అంతేగాక, భవిష్యత్‌లో కూడా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీలోకి తీసుకునేది లేదని మంత్రి అజయ్ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణాకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.

శాశ్వత పరిష్కారం కోసం..

శాశ్వత పరిష్కారం కోసం..

ప్రజలకు ఇబ్బందులు కలగని రీతిలో శాశ్వత విధానాలను రూపొందించే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ వివరించారు. సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని చెప్పారు. మూడు వేల నుంచి నాలుగువేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడిపించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.

తక్షణమే విధుల్లోకి..

తక్షణమే విధుల్లోకి..

అర్హులైన యువత, నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించి బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. తక్షణమే యువతకు శిక్షణ ఇచ్చి బస్సులను నడిపించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోందని పువ్వాడ అజయ్ వివరించారు.

రేపు ఉన్నతస్థాయి సమీక్ష.. 3వేల బస్సులు..

రేపు ఉన్నతస్థాయి సమీక్ష.. 3వేల బస్సులు..

అంతేగాక, ఏడు వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇస్తామని మంత్రి తెలిపారు. శనివారం సాయంత్రం వరకు నెలకొనే పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై ఆదివారం ఉన్నతస్థాయిలో సమీక్షించనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3వేలకు పైగా బస్సులు నడుస్తున్నాయని ఆర్టీసీ ఎండీ సురేష్ శర్మ వెల్లడించారు.

English summary
The Telangana government has set 6 pm on Saturday as the deadline for striking Telangana State Transport Corporation (TSRTC) employees to report to duty at their respective depots lest they will lose their jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X