హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

New Year, omicron హైకోర్టు కీలక ఆదేశాలు.. మార్గదర్శకాలు పాటించాల్సిందేనని స్పష్టం

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ హై టెన్షన్ పుట్టిస్తోంది. వ్యాక్సినేషన్ కంపల్సరీ.. దీంతోపాటు మాస్క్ ధరించి, సోషల్ డిస్టన్స్ తప్పకుండా పాటించాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో 31 ఫస్ట్, న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి బార్లు, రెస్టారెంట్లకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన ధర్మాసనం.. ఒమిక్రాన్ వేరియంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

Recommended Video

Omicron: COVID Restrictions Till 2022 January 31 | New Year | Oneindia Telugu
కేసుల పెరుగుదల

కేసుల పెరుగుదల

న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో కంటైన్మెంట్, మైక్రో కంటైన్మంట్ జోన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోర్టు సూచించింది. రాష్ట్రంలో కోవిడ్ టెస్టులను పెంచడంతోపాటు సరిపడా బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

నివేదిక సమర్పించండి

నివేదిక సమర్పించండి

రాష్ట్రంలో ఒమిక్రాన్ పరిస్థితులపై జనవరి 3 లోపు హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 4 కి వాయిదా వేసింది. కోవిడ్ పై ఈ నెల 21, 27 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారించింది. న్యూ ఇయర్ వేడుకల్ని నియంత్రించాలనే ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పబ్బులు, బార్లలో వేడుకల సమయం మరింత పెంచారని ఆరోపించారు. ఢిల్లీ, మహారాష్ట్ర తరహా ఆంక్షలు విధించాలని పిటిషనర్లు కోర్టును కోరారు.

జోక్యం చేసుకోం..

జోక్యం చేసుకోం..

అయితే న్యూ ఇయర్ వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేిసంది. పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయని న్యాయస్థానం పేర్కొంది. న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిందని హైకోర్టు తెలిపింది. రాష్ట్రంలో టీకా ఫస్ట్ డోస్ 100 శాతం, రెండో డోస్ 66 శాతం పూర్తయిందని తెలిపింది. మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది.

English summary
High Court of Telangana on Friday directed the state government to implement the guidelines issued by the Central Government from time to time in order to control the Covid-19 new variant
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X