హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపిస్ట్ రాజు మృతిపై జ్యుడిషీయల్ విచారణ: 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

రేపిస్ట్ రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో స్వయంగా డీజీపీ మీడియా ముందుకు వచ్చారు. రేపిస్ట్ రాజు సూసైడ్ చేసుకున్నాడని.. ఏడుగురు సాక్షులు ఉన్నారని వివరించారు. అతని ఆత్మహత్యకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడాలని కూడా సూచించారు. ఈ క్రమంలో రాజు మృతికి సంబంధించి హైకోర్టు విచారణ జరిపింది. రేపిస్ట్ రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణ జరపాలని ఆదేశించింది.

Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)

4 వారాల్లో నివేదిక

4 వారాల్లో నివేదిక


రాజు మృతిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. విచారణ బాధ్యతలను వరంగల్ 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు అప్పగించింది. నాలుగు వారాల్లో సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. లైంగిక దాడి, హత్య కేసు నిందితుడు రాజు మృతిపై హైకోర్టు విచారణ జరిపింది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పిల్ పై విచారణ జరిపి.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ వాదనలు వినిపించారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఏజీ ప్రసాద్ కోర్టుకు తెలియజేశారు. ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ వీడియా చిత్రీకరణ జరిగిందని తెలిపారు. అలాగే పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ జరిగిందని వివరించారు. వీడియోలు రేపు రాత్రి 8 లోగా వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు స్పష్టంచేసింది.

ఐ విట్‌నెస్..

ఐ విట్‌నెస్..

రాజు ఆత్మహత్యకు సంబంధించి ప్రత్యక్షసాక్షులు ఇద్దరు రైల్వే కీమెన్లు పూర్తి వివరాలను తెలియజేశారు.ఇద్దరం ఉదయాన్నే డ్యూటీకి ఎక్కామని వారు వివరించారు, ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి పొదల్లోకి పారిపోయాడని వారు చెప్పారు. అనుమానం వచ్చి చెట్లలోకి వెళ్లి చూడగా అతను కనిపించలేదని తెలిపారు. ఆ తర్వాత తామిద్దరం ఒక 200 మీటర్ల దూరం వరకు ట్రాక్ పై నడుచకుంటూ వచ్చామని, ఆ సమయంలో హైదారాబాద్ వైపుగా వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.

రాజు అని నిర్ధారణ

రాజు అని నిర్ధారణ

ఆ తర్వాత వెళ్లి పరిశీలించగా రాజు అనే అనుమానం తమకు వచ్చిందని వివరించారు. ఆ వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందజేశామని తెలిపారు. ఉదయం 8.40 గంటలకు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. రాజు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతని డెడ్ బాడీని కుటుంబసభ్యులు కూడా ధృవీకరించారు. చేతిపై మౌనిక అనే పేరు కూడా ఉంది. చిన్నారి చనిపోయిన ఏడు రోజులకు కీచక నీచుడు రాజుకు కూడా అదేవిధంగా శిక్షపడింది. తనకుతానే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.

ఏడుగురు..

ఏడుగురు..


వీరు ఇద్దరే కాక.. కోణార్క్ ఎక్స్ ప్రెస్ డ్రైవర్లు, ముగ్గురు రైతులు కూడా ఉన్నారని డీజీపీ తెలిపారు. ఇంతమంది ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం పోలీసులే చంపారని ట్రోల్ చేస్తున్నారు. దీంతో పౌరహక్కుల సంఘం నేత పిటిషన్‌ వేసింది. హైకోర్టు విచారణ జరిపి. జ్యుడిషీయల్ విచారణ జరపాలని స్పష్టంచేసింది. రాజు మృతితో చాలా మంది సంతోషంగానే ఉన్నారు. అతనికి అతనే శిక్షవేసుకున్నాడని కామెంట్ చేశారు.

English summary
Rapist raju death: telangana high court orders judicial inquiry on Rapist raju death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X