Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్‌లో మెడికల్ మిరాకిల్: బ్రీతింగ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్: దేశంలోనే తొలిసారి

హైదరాబాద్: వైద్య శాస్త్రం అద్భుతాల మయం. ఎప్పుడు ఎలాంటి మిరాకిల్స్ సంభవిస్తుందనేది ఎవరూ ఊహించలేరు. ఇలాంటివి ఎన్నో సాక్షాత్కరించాయి. ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎక్కడో కాదు- మన హైదరాబాద్‌లోనే. సికింద్రాబాద్ కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) డాక్టర్లు ఓ అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు. దాన్ని విజయవంతం చేశారు. ఈ తరహా శస్త్ర చికిత్స నిర్వహించడం దేశంలోనే ఇదే మొదటిసారి అని కిమ్స్ డాక్టర్లు చెబుతున్నారు.

 ఏమిటా శస్త్ర చికిత్స..

ఏమిటా శస్త్ర చికిత్స..


ఈ శస్త్ర చికిత్స- బ్రీతింగ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్. క్రియాశీలకంగా ఉంటున్న ఊపిరితిత్తులను మరొకరికి అమర్చడం. ఊపిరి తిత్తులను మార్పిడి చేయడం. వైద్య శాస్త్రంలో దీన్ని ఎక్స్‌వీవో ఆర్గాన్ పెర్ఫ్యూషన్ సిస్టమ్ అంటారు. ఓ మధ్య వయస్కుడికి ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశారు కిమ్స్ డాక్టర్లు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లో శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులకు గురై మృత్యువాత పడుతున్న వారికి ఈ తరహా శస్త్ర చికిత్స అందుబాటులోకి రావడం, అది విజయవంతం కావడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.

రోజూ 10 లీటర్ల ఆక్సిజన్‌తో..

రోజూ 10 లీటర్ల ఆక్సిజన్‌తో..

ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతోన్న ఈ పేషెంట్ శ్వాస తీసుకోవడానికి ఈ ఏడాది ఆగస్టు నుంచి రోజూ 10 లీటర్ల ఆక్సిజన్‌ను వినియోగించాల్సి వచ్చేది. ఊపిరితిత్తుల పనితీరు దాదాపు క్షీణదశలో చేరిన సమయంలో డాకర్లు ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ సందీప్ అట్టావర్, ఆయన సారథ్యంలోని బృందం ఈ శస్త్రచికిత్సను దాన్ని విజయవంతం చేసింది. ఎక్స్‌వీవో ఆర్గాన్ పెర్ఫ్యూషన్ సిస్టమ్ ద్వారా ఊపిరితిత్తులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో పని చేయని భాగం అంటూ ఏదీ ఉండదు. వేరొకరు దానం చేసిన ఊపిరితిత్తులు 30 శాతం మేర అధికంగా అవసరార్థులకు అమర్చడానికి వీలు ఉంటుంది.

 ఊపిరితిత్తులు పాడైపోకుండా..

ఊపిరితిత్తులు పాడైపోకుండా..


ఈ ప్రక్రియలో ఊపిరితిత్తులు పాడైపోకుండా ఓ డివైస్ ద్వారా దాన్ని చల్లబరుస్తుంటారు. శ్వాస తీసుకుంటోన్న సమయంలో అది ఎలాంటి పనితీరును కనపరుస్తుందో.. చల్లబరిచేటప్పుడు అదే రకంగా ఉంటుంది. బ్రాంకోస్కోపీ ద్వారా యాంటీ బయాటిక్స్‌ను ఉపయోగించి- ఇన్‌ఫెక్షన్‌కు గురైన ఊపిరితిత్తులను శుద్ధి కూడా చేసే వెసలుబాటు ఈ ప్రక్రియలో అందుబాటులో ఉంటుంది. ఇలా శుద్ది చేసిన ఊపిరితిత్తులను అవసరార్థులకు అమర్చడం వల్ల మరింత వేగంగా ఆ పేషెంట్ కోలుకోవడానికి అవకాశం ఉందని కిమ్స్ డాక్టర్లు చెబుతున్నారు.

Recommended Video

    Omicron Variant : Highest In Maharashtra | Omicron Cases In India
    ఇప్పటిదాకా ఎక్కడెక్కడ..

    ఇప్పటిదాకా ఎక్కడెక్కడ..

    ఇప్పటిదాకా అమెరికా, కెనడా, ఆస్ట్రియాల్లో మాత్రమే పరిమితంగా ఈ బ్రీతింగ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానం అందుబాటులో ఉందని కిమ్స్ డాక్టర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ అట్టావర్ తెలిపారు. దేశంలో తొలిసారిగా దీన్ని నిర్వహించామని అన్నారు. అత్యాధునికమైన ఎక్స్‌వీవో ఆర్గాన్ కండీషనింగ్ సిస్టమ్ అనేది ఓ అద్భుతమైన విధానమని ఆయన పేర్కొన్నారు. ఊపిరితిత్తులను తొలగించిన తరువాత దాన్ని ఐస్‌బాక్స్‌లో ఉంచడం ఆనవాయితీ. ఆ సమయంలో చలికి కొంతభాగం దెబ్బతింటుంటుంది. ఎక్స్‌వీవో ఆర్గాన్ కండీషనింగ్ సిస్టమ్‌లో ఆ ఇబ్బంది ఉండదని చీఫ్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజీ డాక్టర్ విజిల్ రాహులన్ అన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+