హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంకొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ - సభ్యులు, సిబ్బందికి కరోనా టెస్టులు పూర్తి - ప్రధాన చర్చ వీటిపైన

|
Google Oneindia TeluguNews

వైరస్ విలయతాండవం చేస్తోన్నవేళ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ ఆవరణలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశించిన దరిమిలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు శని, ఆదివారాల్లో టెస్టులు చేయించుకున్నారు.

కామోన్మాదంతో కరోనా రోగిపై రేప్ - 108 అంబులెన్స్‌‌లో డ్రైవర్ అకృత్యం - చివరికి ఏమైందంటే..కామోన్మాదంతో కరోనా రోగిపై రేప్ - 108 అంబులెన్స్‌‌లో డ్రైవర్ అకృత్యం - చివరికి ఏమైందంటే..

సభలో ఆరు అడుగుల భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీలో అదనంగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు కేటాయించారు. సభ్యులంతా విధిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. నెగెటివ్ వచ్చిన మారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని స్పీకర్ చెప్పడంతో చాలా మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోని కేంద్రంలోనే కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

 Telangana legislature session begins from Monday amid preventive measures

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రధానంగా కరోనా పరిస్థితులు, ఏపీ జలదోపిడీ, రైతాంగ సమస్యలపై చర్చ జరిగే అవకాశముంది. సోమవారం సభ ప్రారంభానికి ముందే స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించి, అజెండాను ఖరారు చేయనున్నారు. కొవిడ్‌ కట్టడిలో కేసీఆర్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, జల దోపిడీలో ఏపీ సీఎం జగన్ కు సీఎం కేసీఆర్ సహకరిస్తున్న వైనాన్ని ఎడగట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నది. రైతాంగ సమస్యలతోపాటు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం అంశాన్ని కూడా లేవనెత్తాలని ప్రతిపక్షం నిర్ణయించుకుంది. బీజేపీ సైతం కరోనాలో కేసీఆర్ వైఫల్యంపై నిలదీయాలని డిసైడైంది. కాగా,

చైనా మరో సంచలనం: రాజ్‌నాథ్ హెచ్చరికపై ఘాటు రియాక్షన్ - యుద్ధం వస్తే భారత్ ఓడుతుందంటూ..చైనా మరో సంచలనం: రాజ్‌నాథ్ హెచ్చరికపై ఘాటు రియాక్షన్ - యుద్ధం వస్తే భారత్ ఓడుతుందంటూ..

విపక్షాలు లేవనెత్తే అంశాలపై వివరణ ఇస్తూనే ఎదురుదాడి చేసే ఎత్తుగడను అవలంబించాలని అధికార టీఆర్‌ఎస్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏపీ జల దోపిడీపై సీఎం కేసీఆర్ ఇదివరకే బహిరంగ ప్రకటనలు చేసిన నేపథ్యంలో నీటి వాటా కోసం రాష్ట్రం చిత్తశుద్ధితో పోరాడుతోందన్న వాదనను అసెంబ్లీలోనూ వినిపించనున్నారు. కరోనా కట్టడి కోసం మిగతా రాష్ట్రాలకు భిన్నంగా చేపట్టిన చర్యల్ని సైతం సర్కారు వివరించనుంది. అదేసమయంలో జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం భర్తీ చేయకపోవడం, రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలను పెండింగ్‌లో ఉంచడం లాంటి అంశాలతో బీజేపీని కార్నర్‌ చేసేందుకు టీఆర్ఎస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

English summary
The monsoon session of Telangana Legislature commencing on Monday with preventive measures for COVID-19 will debate various issues, including measures taken to contain the spread of the pandemic, GST compensation and recent fire accident at Srisailam Hydel project. All members, including ministers, Telangana legislature employees and mediapersonnel will have to undergo COVID-19 test official said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X