రేపట్నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్: తెలంగాణ పోస్ట్ గ్రాడ్యూయేషన్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్)-2022కు సంబంధించి ఇప్పటికే రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తయింది. అయితే, ఈ రెండు విడతల కౌన్సెలింగ్‌లలో సీట్లు పొందని విద్యార్థల కోసం స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నవంబర్ 9 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పీ రమేశ్ బాబు వెల్లడించారు.

ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ నవంబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు ఉంటుందని తెలిపారు. నవంబర్ 11, 12 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. నవంబర్ 15న సెలక్షన్ లిస్టు విడుదల చేస్తారు.

telangana pgecet-2022 special round counselling from tomorrow.

ఎంపికైన విద్యార్థులు సంబంధిత సెంటర్లలో నవంబర్ 15 నుంచి 19 వరకు నిర్వహించే వెరిఫికేషన్ ప్రక్రియలో హాజరు కావాల్సి ఉంటుందన్నారు. స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్న విద్యా మండలి ఈ మేరకు విడుదల చేసింది.

2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీఈసెట్ 2022లో సాధించిన విద్యార్థులకు రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఎంఈ/ఎంటెక్/ఎంఫార్మసీ/ఎంఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం జరుగుతోంది. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+