అన్నీ రంగాల్లో అభివృద్ది.. దేశం కన్నా రాష్ట్రమే ఎక్కువ: ఇదీ హరీశ్ రావు లెక్క
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశం కంటే రాష్ట్ర గ్రోత్ రేట్ ఎక్కువగా ఉందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతం అని చెప్పారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కంటే పడిపోయిందని వివరించారు. బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం భారత్ కంటే 10 డాలర్లు ఎక్కువగా ఉందని వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం 1885 డాలర్లు, భారత్‌లో తలసరి ఆదాయం 1875 డాలర్లు అని వివరించారు.
ఆరేళ్లలో తెలంగాణ వృద్ధి రేటు నంబర్ వన్‌గా ఉందన్నారు. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణది మూడో స్థానం అని చెప్పారు. తలసరి ఆదాయంలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనం అని వివరించారు. తలసరి ఆదాయంలో ఏడేళ్ల క్రితం తెలంగాణ 10వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. తలసరి ఆదాయంలో గత ఏడేళ్లలో 7 రాష్ట్రాలను తెలంగాణ అధిగమించిందన్నారు.

2014-15 తర్వాత తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే 11.5శాతంతో అత్యధిక సగటు వృద్ధిని తెలంగాణ నమోదు చేసిందన్నారు. 2014-15తో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఇప్పుడు 91.5 శాతం పెరిగిందని చెప్పారు. 2014-15తో పోలిస్తే దేశ తలసరి ఆదాయం ఇప్పుడు 48.7 శాతం మాత్రమే పెరిగిందన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయమే ఎక్కువని వెల్లడించారు.
గత కొంత కాలం నుంచి సీఎం కేసీఆర్ అవలంభించిన విధానాల వల్లే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందన్నారు. ఐటీ, ఇండస్ట్రీ, వ్యవసాయ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో రాష్ట్ర సంపద పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రాల సొంత పన్ను ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ అని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.66,648 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. 2014-15తో పోలిస్తే రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో 90 శాతం వృద్ధి సాధించామని స్పష్టం చేశారు. తెలంగాణ అప్పుల పాలవుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన విమర్శలకు.. మంత్రి హరీశ్‌రావు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కన్నా కూడా తెలంగాణ అభివృద్ది పథంలో ఉందని వివరించారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications