Severe Rainfall Alert:మరో 48 గంటలు వాన, హైదరాబాద్ సిటీలో కుండపోతే..?

ఇటు తెలంగాణలో కూడా వర్షం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మరి తీరం దాటింది. దీని ప్రభావంతో రాగాల 48 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రేటర్‌ వ్యాప్తంగా తేలికపాటి వర్షం పడింది. జగద్గిరిగుట్టలో అత్యధికంగా 4.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట కోతకు వచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో పంటకు భారీ నష్టం జరిగింది.

Telangana Weather News: Rain Alert In Hyderabad Next 2 Days

హైదరాబాద్ సిటీలో గత రెండు మూడు రోజుల నుంచి వాతావరణం చల్లగానే ఉంది. పొడి పొడిగా వర్షం కూడా కురుస్తోంది. దీనికితోడు మరో రెండు రోజులు వాన గండం ఉందనే పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో హైదరాబాదీలు అలర్ట్ అయ్యారు. ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప బయటకు రావడం లేదు. మార్కెట్ అంతంతమాత్రంగానే ఉందని వ్యాపారులు వాపోతున్నారు. కాస్త ఎండ తెరిస్తే తప్ప.. జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. మరో వారం వరకు ఇలా ఉండే అవకాశం ఉంది.

పంట చేతికి వచ్చే సమయంలో కురవనున్న వర్షాలతో రైతులు ఇబ్బందులు పడతారు. ఇప్పటికే వరి పంట చేతికి వచ్చింది. వర్షాలు పడటంతో.. నీటితో తడిగా ఉంటుంది. దీంతో మిషన్ల ద్వారా కోత మరింత కష్టం అవుతుంది. వరుణ దేవ తమను కరుణించు అని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఇటు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం ఎక్కువే నమోదు అవుతుంది. ఇప్పటికే ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. వర్ష బీభత్సం ఇలానే కొనసాగితే.. ప్రాజెక్టులు గరిష్ట నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది. పంటలకు వానాకాలం, యాసంగి పంటలకు నీరు సమృద్ధిగా లభించే పరిస్థితులు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+