హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు అకాడమీ డైరెకర్ట్ సస్పెన్షన్: నలుగురు అరెస్ట్

|
Google Oneindia TeluguNews

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై చర్యలు తీసుకుంది. అతనిని విధుల నుంచి తప్పించింది. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలీ, ఏపీ మర్కంటైల్ సహకార సంస్థ మేనేజర్ పద్మావతి, ఆ సంస్థ చైర్మన్ సత్యనారాయణ రాజు, అదే సంస్థకు చెందిన ఉద్యోగి మొయినుద్దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణంలో రూ.60 కోట్ల రూపాయల వరకూ అకాడమీ నిధులు దారి మళ్లినట్లు అధికారులు గుర్తించారు.

నగదు మాయం..

నగదు మాయం..


హైదరాబాద్‌ కార్వాన్ యూనియన్ బ్యాంకు శాఖ నుంచే నగదు మాయం అయ్యాయి. గతేడాది జులై నుంచి విడతలవారీగా బ్యాంకులోని సొమ్ములో రూ.43 కోట్లు కాజేశారు. ఇదే బ్యాంకు సంతోష్ నగర్ బ్రాంచ్ నుంచి మరో రూ.8 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు మాయం అయ్యాయి. ఈ డబ్బును జులై, ఆగస్టు నెలల్లో దారి మళ్లించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. కెనరా బ్యాంకు నుంచి మరో రూ. 9 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము కూడా గోల్‌మాల్ చేశారు. ఈ కుంభకోణంలో రూ. 60 కోట్లకు పైగా సొమ్ము చేతులు మారినట్లు తేలింది. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్కారు అకాడమీ డైరెక్టర్.. సోమిరెడ్డిని పదవీ నుంచి తప్పించింది. ఈ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు అప్పగించింది.

నలుగురు అరెస్ట్

నలుగురు అరెస్ట్

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా మరో మరొకరి అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ సొసైటీ ఉద్యోగి మొయినుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ పద్మావతీను పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు.

మేనేజర్లు డ్రా..

మేనేజర్లు డ్రా..

తెలుగు అకాడమీ నిధులను ఇద్దరు కలిసి స్వాహా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఇద్దరు మేనేజర్లు డ్రా చేశారు. సిద్దంబర్ బజార్ బ్రాంచ్ మేనేజర్‌గా పద్మావతి పనిచేస్తుండగా.. కార్వాన్, సంతోష్ నగర్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లకు మస్తాన్ వలీ పనిచేస్తున్నారు. కేసులో విచారణ చురుగ్గా సాగుతోంది. తెలుగు అకాడమీ ఉద్యోగులను సైతం ప్రశ్నిస్తున్నారు. మరో ముగ్గురు తెలుగు అకాడమీ అధికారుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది.

అక్రమాలు

అక్రమాలు

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 63 కోట్ల రూపాయలు గల్లంతయినట్టు దర్యాప్తు కమిటీ గుర్తించింది. యూనియన్‌ బ్యాంక్‌ కార్వాన్‌ శాఖ నుంచి 43 కోట్లు, సంతోష్‌ నగర్‌ బ్రాంచిలో 10 కోట్లు, చందానగర్‌ కెనరా బ్యాంకు శాఖ నుంచి 10 కోట్ల రూపాయలు గల్లంతయ్యాయని తేలింది. నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో తెలుగు అకాడమీ అధికారుల నిర్లక్ష్యాన్ని దర్యాప్తు కమిటీ గుర్తించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పది ప్రభుత్వరంగ బ్యాంకు బ్రాంచీల్లో రూ.320 కోట్ల డిపాజిట్ చేసింది. చందానగర్‌ కెనరా బ్యాంకులోని 33 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇటీవలే రూ.20 కోట్లను అకాడమీ అధికారులు విత్‌ డ్రా చేసుకున్నారు.

English summary
telugu academy director somireddy suspended by the government. this case four members also arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X