హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్య‌మంత్రుల ద‌గ్గ‌ర‌కు వెళ్లారు... కొంప మునిగింది??

|
Google Oneindia TeluguNews

చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకొని ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. అత్యాశ‌కు పోయారు.. అభిమానాన్ని సొమ్ము చేసుకుందామ‌నుకున్నారు.. ఇంకా ఇంకా డ‌బ్బులు కావాలంటూ థియేట‌ర్ల‌లో అత్య‌ధిక టికెట్ రేట్లు పెట్టి కొల్ల‌గొడ‌దామ‌నుకున్నారు.. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ఒప్పుకోవ‌ని తెలుసు.. అందుకే నేరుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య‌మంత్రుల‌ను క‌లిసి వేడుకున్నారు.. ఆహా.. ఓహో.. రెండు వారాల్లో పెట్టుబ‌డితోపాటు లాభం కూడా ఒకేసారి వ‌చ్చి ఒళ్లో ప‌డుతుంది.. అంటూ క‌ల‌ల్లో తేలిపోయారు. అంతిమంగా క‌ల చెదిరిపోయింది.

కళ్లెదుటే ప్రత్యక్షమైన వాస్తవం

కళ్లెదుటే ప్రత్యక్షమైన వాస్తవం

ఏపీ ప్రభుత్వం ప్రజలకు వినోదాన్ని తక్కువకే అందజేయాలన్న ఉద్దేశంతో థియేటర్లలో తక్కువ ధరలు పెడితే పెట్టుబడి కూడా రాదు.. మేమెలా బతకాలంటూ ముఖ్యమంత్రి ఎదుట వాలిపోయారు. ఆయనపై ఒత్తిడి తెచ్చారు.. టికెట్ ధరలు పెంచుకున్నారు.. ధరలు తగ్గించకపోయినప్పటికీ తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. పరిశ్రమ అడగ్గానే ప్రభుత్వం కూడా సరేలే అంది.

కానీ ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌కు క‌ళ్ల ముందు వాస్త‌వం ప్ర‌త్య‌క్ష‌మ‌వుతోంది. ప్ర‌భుత్వాధినేత‌ల‌ను క‌లిసిన‌ప్పుడు.. టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకున్న‌ప్పుడు అంతా బాగానే ఉన్న‌ట్లు క‌న‌ప‌డింది. అంతిమంగా కొంప మునిగింది. దీనంత‌టికీ కార‌ణం.. అగ్ర భాగంలో ఉన్నామ‌ని చెబుతున్న ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, క‌థానాయ‌కులు.

వీరి అత్యాశే వీరి కొంప ముంచ‌డంతోపాటు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను నిండా ముంచింది. థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రావ‌డం మానేశారు. క‌థానాయ‌కుల వీరాభిమానులు కూడా త‌గ్గిపోతున్నారు. వారంతా మొద‌టిరోజు మొద‌టి ఆట‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతున్నారు. ఫ్లాప్ అని టాక్ వ‌స్తే మ్యాట్నీకి మాయ‌మ‌వుతున్నారు.

థియేటర్లకు ఎవరూ రారు..

థియేటర్లకు ఎవరూ రారు..


కావాలంటే ఓటీటీల్లో చూసుకోవ‌చ్చు.. లేదంటే పైర‌సీ సైట్ల‌లో చూసుకోవ‌చ్చు.. అంత డబ్బులు పెట్టి టికెట్ కొనుగోలు చేయ‌డం.. మ‌ళ్లీ క్యాంటిన్ల‌లో అంతంత ధ‌ర‌లు పెట్టి తినుబండారాలు కొనుగోలు చేయ‌డంలాంటివ‌న్నీ అన‌వ‌స‌ర ఖ‌ర్చు అనిపించాయి. దీంతో సినిమా ప‌రిశ్ర‌మ‌కు సినిమా అర్థ‌మైంది. ఏం చేయాలో పాలుపోవ‌డంలేదు అంతే. చాలావ‌ర‌కు థియేట‌ర్ యాజ‌మాన్యం త‌మ థియేట‌ర్ల‌ను మూసుకున్నాయి. ఉన్న థియేట‌ర్ల‌కు ఎవ‌రూ రావ‌డంలేదు. ఫిలిం ఛాంబ‌ర్ స‌మావేశం మాత్రం అలా జ‌రుగుతూనే ఉంటుంది.

పారితోషికాలు తగ్గించుకున్నా లాభాల్లో వాటా తీసుకుంటారుగా..

పారితోషికాలు తగ్గించుకున్నా లాభాల్లో వాటా తీసుకుంటారుగా..

క‌థానాయ‌కులు పారితోషికం త‌గ్గించుకుంటారు కానీ లాభాల్లో వాటా తీసుకుంటారు. లాభాలు రావాలంటే థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రావాలిగ‌దా.. ఇప్ప‌ట్లో ఎవ‌రూ థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప‌రిస్థితే లేదు. మ‌ల్టీప్లెక్స్ లో రూ.150, సింగిల్ థియేట‌ర్ లో రూ.100 చాలు అంటున్నారు. కానీ రూ.50 పెట్టినా ఎవ‌రూ రాని ప‌రిస్థితి నెల‌కొంది. టికెట్ ధ‌ర‌ల‌తోపాటు క్యాంటిన్ల‌లో ఉండే ధ‌ర‌లు కూడా ఒక కార‌ణం.

కుటుంబంతో సహా థియేటర్ కు రావడం అనే ప్రశ్నే భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే అవకాశం లేదని తెలుగు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతిమంగా త‌న నెత్తిన తానే చేయిపెట్టుకొని హ‌త‌మైన భ‌స్మాసురుడిలా తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి ఉందంటూ వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి.. సినీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి మరి.

English summary
Audiences stopped coming to theatres.Hero fans are also decreasing.All of them are limited to the first game on the first day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X