హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్, కేటీఆర్‌కు కృతజతలు: మేయర్ విజయలక్ష్మీ.. కొత్త కార్యవర్గానికి అసదుద్దీన్ విషెస్

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికయిన గద్వాల విజయలక్ష్మి.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను మహిళలకు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. అందుకు కేసీఆర్, కేటీఆర్‌కు మరోసారి ధన్యవాదాలు చెప్పారు. హైదరాబాద్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని చెప్పారు.

జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం (ఫోటోలు)

సిటీ డెవలప్‌మెంట్..

సిటీ డెవలప్‌మెంట్..

నగర అభివృద్ధి కోసం అందరి సలహాలూ తీసుకుంటానని విజయలక్ష్మి చెప్పారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అవినీతిపై పోరాడుతానని స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ తాము ఎవరికీ మద్దతివ్వడం లేదని చెప్పిన మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. తమ పార్టీకి చెందిన సభ్యులను బరిలోకి దించలేదు. ఎక్స్ అఫీషియో ఓట్లు అవసరం లేకుండానే టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను సాధించింది.

అసద్ అభినందనలు

అసద్ అభినందనలు

టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే కుమార్తె, టీఆర్ఎస్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి గ్రేటర్ మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో టీఎఆర్ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలిపారు.

 టీఆర్ఎస్‌కు థాంక్స్

టీఆర్ఎస్‌కు థాంక్స్

వీరి నాయకత్వంలో హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నామని అసదుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్ పాతబస్తీ సహా అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతాయని ఆశిస్తున్నామని వివరించారు. జీహెచ్ఎంసీ కార్యకలాపాలు నిజాయతీగా, ఆర్థిక సాధికారతతో నిర్వర్తిస్తుందని ఆకాంక్షిస్తున్నామని ఒవైసీ తెలిపారు. తమకు డిప్యూటీ మేయర్ పదవీ ఆఫర్ చేసిన టీఆర్ఎస్‌ను ప్రశంసిస్తున్నామని పేర్కొన్నారు.

English summary
thanks to kcr, ktr hyderabad mayor vijayalaxmi said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X