Hyderabad: పాత మంచం పెట్టారని పెళ్లినే ఆపిన వరుడు.. పోలీసులు ఏం చేశారంటే..!
చాలా మందికి పెళ్లంటే జీవితంలో ముఖ్యమైన ఘట్టం. అయితే ఈ పెళ్లంటే ఎన్నో పనులు ఉంటాయి. మర్యాదలు, పట్టింపులు కూడా ఉంటాయి. మగ పెళ్లివారికి అమ్మాయి తరపువారు మర్యాదలు చేయాలని అంటారు. అలాగే పెళ్లి కూతురుకు పుట్టింటి వారు సామాగ్రి కూడా పెడతారు. బోళ్లు, బీరువా, బెడ్ మంచాలు, కూలర్లు, ఇలా రకరకాల వస్తువులు తమ కూతురికి బహుమతిగా ఇస్తుంటారు
అయితే ఓ పెళ్లి కొడుకు తనకు పెట్టే ఓ వస్తువు పాతదని పెళ్లే చేసుకోలేదు. ఈ ఘటన హైదరాబాద్ బండ్లగూడలో చోటు చేసుకుంది. మౌలాలికి చెందిన మహ్మద్ జకారియా స్కూల్ బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతనికి బండ్లగూడ రహమత్ కాలనీకి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. వీరి పెళ్లి ఈనెల13 తేదీన జరగాల్సి ఉంది. అయితే ఈ పెళ్లికి మండపానికి పెళ్లికొడుకు రాకపోవడంతో పెళ్లి ఆగిపోయింది.

పెళ్లి కొడుకు ఎందుకు రాలేదని వాకాబు చేయక.. ఆశ్చర్య కరమైన విషయం తెలిసింది. తనకు పాత మంచం పెట్టినందుకు పెళ్లి ఆపినట్లు తెలిసింది. వధువుకు పుట్టింటి వారు బీరువా, మంచం, పరుపు, డ్రెస్సింగ్ టేబుల్ వరుడి ఇంటికి పంపాపు.
అయితే మంచం విడిభాగాలను బిగిస్తుండగా.. విరిగిపోయాయి. తనకు పాత మంచానికి రంగులు వేసి పంపించారని ఆగ్రహించిన జకారియా పెళ్లి సమయానికి వెళ్లలేదు.
దీంతో పెళ్లి ఆగిపోయింది. వెంటనే వధువు తరుపు వారు పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లగా.. తనకు పాత మంచం పెట్టారని.. విడి భాగాలు అమర్చతుండగా విరిగిపోయిందని జకారియా చెప్పాడు. అందుకే పెళ్లి మండపానికి రాలేదన్నాడు. వధువు తరుపు వారు ఎంత బతిమిలాడినా అతను పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో చేసేది ఏమి లేక వారు వెనుదిరిగారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications