Ramoji Film City: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేత మృతి..!
రంగారెడ్డి జిల్లా రామోజీ ఫిల్మ్ సీటీలో జరిగిన ఓ సాప్ట్ వేర్ కంపెనీ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ మరణించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జనవరి 18న విస్టెక్స్ అనే ఎంఎన్ సీ కంపెనీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు అమెరికాలోని చికాగోలో ఉంటున్న కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ, చీఫ్ అర్కికెట్ సంజయ్ షా ఫిల్మ్ సిటీకి వచ్చారు.
గురువారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన తో పాటు ఆ సంస్థ ఉద్యోగులు 700 వరకు పాల్గొన్నారు. రాత్రి 11 గంటల సమయంలో కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన సెట్ పైకి ఎక్కారు. ఆయనతో పాటు చాలా మంది ఒకేసారిగా సెట్ పైకి ఎక్కారు. సెట్ పైకి పరిమితికి మించి ఎక్కడంతో సెట్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అందరు కింద పడిపోయారు.

ఈ ప్రమాదంలో సంజయ్ షా తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు విశ్వనాథ్ రాజ్ కూడా గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స కోసం మలక్ పేట యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. సంజయ్ షా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనకు కారులైన రామోజీ ఈవెంట్స్ ఆథారిటీపై కంపెనీ ఎక్స్ క్యూటివ్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఐపీసీ సెక్షన్ 336,287,r/w 34 చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే సెట్ పైకి పరిమితికి మించి ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications