Hyderabad: వ్యక్తి మరణానికి కారణమైన ప్రముఖ ఆస్పత్రికి రూ.15 లక్షల ఫైన్..!
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మరణించిన రోగి కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. 62 ఏళ్ల వ్యక్తిని కోల్పోయినందుకు పరిహారంగా రూ.2 కోట్లు ఇవ్వాలని కోరుతూ మృతుడి కుటుంబీకులు దాఖలు చేసిన ఫిర్యాదు పిటిషన్ పై విచారించిన వినియోగదారుల ఫోరం ఈ ఆదేశాలు జారీ చేసింది. హన్మకొండలో నివాసం ఉండే కె. జనార్దన్ రెడ్డికి తేలికపాటి జ్వరం రావడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.
దీంతో ఆయన్ను ఫిబ్రవరి 2019లో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జనార్దన్ రెడ్డికి ఊపిరితిత్తులకు సంబంధించి సమస్య లేదని.. గుండెకు సంబంధించి సమస్య ఉందని చెప్పి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గుండె మిట్రల్ వాల్వ్‌లో కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అది మళ్లీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జనార్దన్‌రెడ్డి గుండె శస్త్రచికిత్సకు వెళ్లాలని కోరారు. అయితే ఇది అత్యవసరం కాదని కుటుంబ సభ్యులకు తెలిపారు.

ఆయన ఫిబ్రవరి 17, 2019 న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జనార్ధన్ రెడ్డి సమస్య గురించి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని సన్‌షైన్ హాస్పిటల్ వైద్యుడిని సంప్రదించారు. ఆ వైద్యుడు కూడా శస్త్రచికిత్స చేసుకోవాలని.. దానికి రూ. 5 లక్షలు ఖరీదు చేశారు. కుటుంబ సంభ్యులు సెకండ్ ఒపీనియన్ కోసం బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్స్‌కు వెళ్లారు. అక్కడ వారు కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ గోపీచంద్ మన్నంను కలిశారు.
రిపోర్టులన్నీ పరిశీలించిన తర్వాత, మిట్రల్ వాల్వ్‌ను మార్చడానికి గుండె శస్త్రచికిత్స అవసరమని డాక్టర్ కుటుంబ సభ్యులకు తెలిపారు. త్వరగా కోలుకోవడానికి సాంప్రదాయ పద్ధతులతో పాటు, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనే పద్ధతి ఉందని దీనికి రూ.10.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. శస్త్రచికిత్స చేయడానికి ఇది సురక్షితమైన పద్ధతి అని చెప్పారు. దీని సక్సెస్ రేటు దాదాపు 98% ఉందని కుటుంబానికి హామీ ఇచ్చాడు.
జనార్దన్ రెడ్డి ఫిబ్రవరి 27, 2019న స్టార్ హాస్పిటల్స్‌లో చేరారు. 28 ఫిబ్రవరి 2019న జనార్దన్ రెడ్డి శస్త్రచికిత్స కోసం ఆపరేషన్ థియేటర్‌కి తరలించారు. శస్త్రచికిత్స ఉదయం 11 గంటలకు ముగుస్తుందని చెప్పిన డాక్టర్లు.. సాయంత్రం 5 గంటలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సాయంత్ర 5 గంటల తర్వాత డాక్టర్ మన్నం థియేటర్ నుంచి బయటకు వచ్చి, కొన్ని సమస్యలు ఉన్నాయని కుటుంబ సభ్యులకు చెప్పారు.

అర్ధరాత్రి జనార్దన్‌రెడ్డి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే తమ పక్షంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని స్టార్ హాస్పిటల్ తన రక్షణగా పేర్కొంది. శస్త్రచికిత్సకు సంబంధించిన ప్రమాదాల గురించి రోగి కుటుంబ సభ్యులకు తెలియజేశామని పేర్కొంది. దీంతో బాధితులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జనార్దన్ రెడ్డి మరణించినట్లు నిర్ధారించిన ఫోరం.. మృతుడి కుటుంబానికి రూ.15 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. వ్యాజ్య ఖర్చుగా కుటుంబానికి అదనంగా రూ. 25000 చెల్లించాలని ఆస్పత్రికి స్పష్టం చేసింది.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications