Hyderabad: బెంగళూరు వెళ్లిన విమానం.. తిరిగి హైదరాబాద్ కే వచ్చింది..!
ఈ మధ్య విమానాలకు బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. దీంతో విమాన ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనిపై కేంద్ర సీరియస్ గా ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తాజాగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లిన ఓ విమానం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంది.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానం బెంగళూరులో ల్యాండింగ్ చేయకుండానే తిరిగి వెనక్కు వచ్చింది.
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 7:20 గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం బెంగళూరుకు చేరుకుంది. అక్కడ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ చేయడానికి పైలట్ ప్రయత్నించాడు. కానీ రన్ వే సరిగా కనిపించలేదు. అప్పటికీ విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపై 45 నిమిషాలకు పైగా విమానం చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ పరిస్థితులు మెరుగుపడలేదు. దీంతో విమానయాన సంస్థ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రయాణికులందరితో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించింది.

ప్రయాణికులకు పరిస్థితిని వివరించి తిరిగి శంషాబాద్ చేరుకుంది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రధాన విమానాశ్రయాల్లో పొగమంచు దృశ్యమానతను గణనీయంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్ లో కూడా పొగ మంచి ఏర్పాడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో వాలు కాలుష్యంతో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
గత నెలలో ఎయిర్ ఇండియా విమానం హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యంతో ఆందోళన నెలకొంది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పైలట్ వైఫల్యాన్ని గుర్తించి ల్యాండింగ్ ప్రయత్నించాడు. గాల్లోనే చాలా సేపు చక్కర్లు కొట్టిన విమానాన్ని చివరికి జాగ్రత్తగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications