Hyderabad: పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడి మృతి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు..
పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి చనిపోవడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మరణించడంపై హైకోర్టు స్పందించింది. ఘటనను సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించింది. ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీపీ, నార్త్ జోన్ డీసీపీ, గోపాలపురం ఏసీపీ, తుకారాంగేట్ ఎస్‌హెచ్‌ఓలను చేర్చింది. చిరంజీవి అనే వ్యక్తిని మంగళవారం సాయంత్రం దొంగతనం కేసులో పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. చిరంజీవి స్టేషన్ కు వెళ్లిన కొన్ని గంటల్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
చిరంజీవికి ఫిట్స్ వచ్చి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సికింద్రాబాద్ సింగరేణి కాలనీలో చిరంజీవి ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు. అయితే ఓ దొంగతనం కేసులో చిరంజీవిని తుకారాం గేట్ పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కొందరు పోలీసులు ఇంటికి వచ్చి దొంగతనం కేసుకు సంబంధించి విచారిస్తామని చెప్పి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. చిరంజీవిని ఏ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్తున్నారో పోలీసులు వెల్లడించలేదని చెప్పారు.

ఫిట్స్ కారణంగా చిరంజీవి కుప్పకూలి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మంగళవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పోలీసులు చిరంజీవి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే అతడిని చిత్రహింసలకు గురిచేయడం వల్లే చనిపోయిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతదేహం తల, ముఖం, అవయవాలపై గాయాల గుర్తులు ఉన్నాయని, పోలీసు కస్టడీలో అతను చిత్రహింసలకు స్పష్టంగా తెలుస్తోందని చెబుతున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పలు పత్రికాల్లో కథనాలు రావడంతో ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
జనవరి 29న మెదక్ లో ఖదీర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు పోలీస్ స్టేషన్ లోనే ఉంచి, ఆ తర్వాత అతని భార్యను పిలిపించి ఖదీర్‌ను ఆమెకు అప్పగించారు. ఆ తర్వాత ఖదీర్ అనారోగ్యం పాలవ్వడంతో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడ్నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఖదీర్ మృతి చెందాడు. దీంతో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి ఖదీర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

మరణించే ముందు ఖదీర్.. తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని చెప్పాడు. తాను దొంగతనం చేయలేదని చెప్పినా.. వినకుండా ఎస్ఐతోపాటు కానిస్టేబుళ్లు విచక్షణారహితంగా కొట్టారని చెప్పాడు. తాను ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన తర్వాత తనను విడిచిపెట్టారని వాంగ్మూలం ఇచ్చాడు. ఖదీర్ మరణంతో ఎస్ఐ రాజశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్లను క్రమశిక్షణ పరమైన చర్యలు తీసుకున్నారు.
ఇటీవల ఓ చోరీ కేసులో నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిరంజీవిని పోలీసులు మంగళవారం (ఏప్రిల్ 25న) సాయంత్రం అరెస్ట్ చేసి తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఈ కేసుపై విచారిస్తుండగా నిందితుడు కుప్పకూలాడు. ఆస్పత్రి తరలిస్తుండగా చనిపోయాడు. అయితే.. పోలీసులే కొట్టి చంపారంటూ చిరంజీవి కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రి ఎదుట బుధవారం (ఏప్రిల్ 26న) ఆందోళనకు దిగారు. నిందితుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. పోలీసులు కొట్టడంతోనే చనిపోయాడని ఆరోపిస్తున్నారు. దీనిపై వార్తా పత్రికల్లోనూ కథనాలు ప్రచురితమవ్వడంతో వాటి ఆధారంగా హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది.












Click it and Unblock the Notifications