High Court: హెచ్‍సీఏకు షాకిచ్చిన హైకోర్టు.. రూ.17.5 కోట్లు చెల్లించాలని ఆదేశం..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు హైకోర్టు షాకిచ్చింది. విశాఖ ఇండస్ట్రీస్ కు ఆరు వారాల్లోగా.. రూ.17.5 కోట్లు చెల్లించాలని హెచ్‍సీఏకు స్పష్టం చేసింది. విశాఖ ఇండస్ట్రీస్ 2004లో ఉప్పల్ స్టేడియం నిర్మాణం కోసం బ్యాంకు నుంచి అప్పు చేసి స్పాన్సర్ షిప్ చేసింది. అయితే ఆ తర్వాత హెచ్‍సీఏ విశాఖ ఇండస్ట్రీస్ తో ఉన్న స్పాన్సర్ షిప్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీనిపై విశాఖ ఇండస్ట్రీస్ హైకోర్టుకు వెళ్లింది.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. అగ్రిమెంట్ రద్దు చేసినందుకు 18 శాతం ఏడాది వడ్డీతో రూ. 25 కోట్లు చెల్లించాలని 2016 లో కోర్టు హెచ్‍సీఏకు తేల్చి చెప్పింది. దీనిపై హెచ్‍సీఏ కమర్షియల్ కోర్టుకు వెళ్లింది. కేసు విచారించిన కోర్టు.. హెచ్‍సీఏ ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను 2022 అక్టోబర్ లో అటాచ్ చేసింది. దీనిపై హెచ్‍సీఏ హైకోర్టుకు వెళ్లింది. విచారణ చేపట్టిన హైకోర్టు ఆరు వారాల్లోగా రూ. 17.5 కోట్లు విశాఖ ఇండస్ట్రీస్ కు చెల్లించాలని హెచ్‍సీఏను ఆదేశించింది.

దీనిపై హెచ్‍సీఏ కమర్షియల్ కోర్టుకు అప్పీల్ కి వెళ్లినా.. ఎక్కడా స్టే ఇవ్వలేదని చెప్పారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నా.. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ తో పాటు ఇతర మ్యాచ్ లను హెచ్‍సీఏ నిర్వహించినట్లు పేర్కొన్నారు. హైకోర్టు కూడా ఆరు వారాల్లోగా రూ. 17.5 కోట్లు.. తమ అకౌంట్ లో డిపాజిట్ చేయాలని తీర్పు ఇచ్చిందని తెలిపారు.












Click it and Unblock the Notifications