Hyderabad: హైదరాబాదీలకు షాకింగ్ న్యూస్.. ఇక చుక్కలే..!

హైదరాబాదీలకు భారత వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈసారి ఎండలు మండిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఫిబ్రవరిలో ఎండలు ఎక్కువగా ఉంటే మార్చిలో మరింత ఎక్కువగా ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఎండకాలం మార్చి 21 మొదలు కావాల్సి ఉంది. కానీ ఈసారి వేసవి మార్చి ప్రారంభంలో వస్తుందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.

మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా సగటు పరిధిలోనే ఉంటాయనిహైదరాబాద్‌ ఐఎండీ అధికారి డాక్టర్ ఎ శ్రావణి అంచనా వేశారు. రెండో వారంలో ఉష్ణోగ్రతలు బహుశా పెరగొచ్చని చెప్పారు. ఇది ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. "వేసవి ఊహించిన దాని కంటే త్వరగా వస్తున్నట్లు సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి" అని అన్నారు. ఫిబ్రవరిలో సాధారణం కంటే ఎక్కువ వేడి, తేమ ఉన్నట్లు అనిపించినప్పటికీ, ఈ పరిస్థితులు సంవత్సరంలో ఈ సమయానికి విలక్షణంగా ఉన్నాయన్నారు.

The IMD has predicted that the intensity of the sun is likely to be higher in the coming summer

ఫిబ్రవరిని వాతావరణ కల్లోలం నెలకొందని, హైదరాబాద్‌లో అనూహ్య వాతావరణం నెలకొందని ఆమె పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలో ఆకస్మిక తగ్గింపులు, హెచ్చుతగ్గులు, అలాగే పొగమంచు, మేఘావృతమైన ఆకాశంతో సహా అనేక మార్పులను గమనించినట్లు వివరించారు. మార్చి 5 వరకు నగరంలో ఆకాసం పాక్షికంగా మేఘావృతమై, పొగమంచు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే అత్యధిక ఉష్ణోగ్రత సగటున 35 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు అంచనా వేశారు.

ఇక రాత్రి కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉందన్నారు. మొత్తానికి ఈసారి ఎండకాలం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఎండలు మండిపోవడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. మరోవైపు భూగర్భ జలాలు అడుగట్టుతున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నీటి ఎత్తడి నెలకొంది. దీంతో చాలా మంది ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు. అటు వ్యవసాయానికి కూడా నీరు అందడం లేదు. చూడాలి ఈసారి సమ్మర్ ఎలా ఉంటుందో.. ఎన్ని సమస్యలు తీసుకొస్తోందో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+