Muralimukund: పని మనిషిపై మురళీముకుంద్ లైంగిక దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు..
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ ఛైర్మన్ మురళీముకుంద్, అతడి కుమారుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి మురళీముకుంద్, అతడి కుమారుడు ఆకాష్ ఇంట్లో పనిచేసే యువతిని బెదిరించి లైంగిక దాడి చేసి, రోజూ కొడుతున్నారని బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ యువతి (22) ఇళ్లల్లో పని చేసేందుకు ఓ ఏజెన్సీలో పేరు నమోదు చేసుకుంది.
ఏజెన్సీ వారు జూన్ 18న ఆమెను బంజారాహిల్స్ లోని నివాసం ఉండే మురళీ ముకుంద్, ఆకాష్ వద్ద పనికి నియమించారు. రెండు వారాల తర్వాత నుంచి తండ్రీకొడుకులు ఆమెను వేధించడం మొదలు పెట్టారు. జులై 16న మురళీముకుంద్ ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఈ విషయం బయటకు చెబితే యువతిని, ఆమె తల్లిని చంపేస్తానని బెదిరించాడు. విషయాన్ని ఆకాష్ కు చెప్పగా రోజూ కొడుతుండడంతో బాధితురాలు నెల రోజులు క్రితం పోలీసులను ఆశ్రయించగా రాజీ కుదిర్చి పంపించారు.

ఆ సమయంలో జరిగిన దారుణాన్ని యువతి ఇటీవల తల్లికి చెప్పింది. ఆమె సహాయంతో ఈ నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను భరోసా కేంద్రానికి తరలించారు. మురళీ ముకుంద్, ఆకాష్ పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జులై 16న మురళిముకుందు తన బెడ్ రూమ్ లో బెడ్ షీట్ మడతపెట్టాలని బెడ్ రూమ్ కు పంపాడు. ఆ తర్వాత అతను కూడా వెళ్లి తలుపులేసుకున్నాడు. స్నానం చేసి రావాలని యువతిని బలవంత పెట్టాడు. ఆమె చెప్పినట్లు వినకపోవడంతో బెదిరింపులకు దిగాడు.
దీంతో యవతి మురళీముకుంది చెప్పినట్లు చేసింది. ఆమె స్నానం చేసి బయటకు రాగానే ఫొటోలు, వీడియోలు తీశానని బెదిరించి లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల్లితో పాటు నిన్ను చంపుతానని యువతిని బెదిరించాడు. రెండు రోజుల తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని ఆకాష్ కు చెప్పింది. అతను ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె నెల రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇరువర్గాలకు రాజీ కుదిర్చారు. దీంతో గొడవ సద్దుమణిగింది. అయితే యువతి తల్లికి జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications