Hyderabad: మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. పశ్చిమ బెంగాల్‍లో నిందితుడు అరెస్ట్..

కొద్ది రోజుల క్రితం గౌచ్చిబౌలి ప్రాంతంలో ఓ మహిళను అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను పట్టుకున్నారు. గత నెల 25న 38 ఏళ్ల ఓ మహిళ గచ్చిబౌలి ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో పాటు నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కేసును సీరియస్ తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

మాదాపూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా & ఆర్డర్), డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి సందీప్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన శ్యామల్ రాయ్ ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి కాశమ్మ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. గత నెల 25 వీరిద్దర గచ్చిబౌలిలోని నిర్మానుష్య ప్రాంతంలో కలిశారు.

The police solved the case of a woman named Kashamma in Gachibowli

అప్పుడు వారి మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది. శ్యామల్ రాయ్ కోపంలో కాశమ్మన రాయితో కొట్టి చంపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడే పడేసి పారిపోయాడు. ఈ విషయాన్ని తనపాటు కూలీ పనులు చేసే అశోక్ కుమార్ సర్కార్, అలోక్ సర్కార్ కు చెప్పాడు. వారు కూడా ఈ విషయాన్ని పోలీసులు చెప్పాలేదు. ఆ తర్వాత శ్యామల్ రాయ్ పశ్చిమ బెంగాల్ పారిపోయాడు. ఆగస్టు 27న బాధితురాలి కుమార్తె తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ తర్వాత ఆగస్ట్ 29న వాసవి నిర్మాణ స్థలంలో మహిళ నిర్జీవ శవం లభ్యమైంది. మృతదేహాన్ని కాశమ్మగా గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి అక్కడ ప్రధాన నిందితుడు శ్యామల్ రాయ్‌ను అరెస్టు చేశారు. అతనితో పాటు అతని సహచరులు అశోక్ కుమార్ సర్కార్ (23), అలోక్ సర్కార్ (25) అదుపులోకి తీసుకున్నారు. ఆగష్టు 25 న, శ్యామల్ రాయ్ ఆ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడి చీరతో గొంతు నులిమి చంపి, బరువైన సిమెంట్ రాయితో ఆమె ముఖంపై దారుణంగా దాడి చేయడంతో కాశమ్మ మృతి చెందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+