Chicken: నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధర..!

ఆదివారం వచ్చిందంటే చాలా మందికి ముక్క లేనిది బుక్క దిగదు. అందుకే ఆదివారం చికెన్, మటన్, చేపల మార్కెట్ల వద్ద రద్దీ కనిపిస్తోంది. కొందరు ముక్కతో పాటు చుక్క కూడా తీసుకుంటారనుకోండి అదే వేరే విషయం. అయితే ఇప్పుడు చికెన్ ప్రియులకు షాక్ తగిలింది. ఒక్కసారిగా ధర పెరిగింది. 15 రోజుల కిందటి వరకు స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.220 నుంచి రూ.240 వరకు పలికింది. ఇప్పుడు అదే స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది.

నెల క్రితం వరకు శ్రావణం, ఆ తర్వాత వినాయక చవితి కవడంతో చికెన్ ధర తగ్గింది. కానీ ఇప్పుడు డిమాండ్ పెరగడంతో చికెన్ ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు పండగ సీజన్ కావడంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెరిగిన ధరలతో కొందరు కిలో కొనుగోలు చేసేవారు అర కిలతో సరిపెట్టుకుంటున్నారు. ఇక నాన్ వెజ్ లో వేసుకునే వెల్లుల్లి ధర కూడా భారీగానే ఉంది. కిలో వెల్లుల్లి రూ.400 నుంచి రూ.500 వరకు పలుకుతోంది.

The price of chicken which is loved by many has gone up drastically

వెల్లుల్లితో పాటు ఉల్లి ధర కూడా భారీగానే పెరిగింది. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 పలుకుతోంది. 20 రోజుల క్రితం వరకు కిలో ఉల్లి రూ.30 నుంచి రూ.40 ఉండేది.. కానీ ప్రభుత్వం ఉల్లి ఎగుమతి సుంకం ఎత్తివేయడంతో ధర పెరిగింది. దీంతో ప్రభుత్వం నాఫేడ్ ద్వారా కిలో ఉల్లి రూ.35 లకే విక్రయిస్తోంది. రైతు బజార్, మార్కెట్ల వద్ద అమ్ముతున్నారు. ఒకరి ఒక కిలో చొప్పున విక్రయిస్తున్నారు. ఇక కోడి గుడ్డు ధర కూడా ఎక్కువగానే ఉంది. రిటైలో కోడి గుడ్డు ఒకటి రూ.6 పలుకుతోంది.

కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు పెరిగాయి. కిలో టమాటా రూ.50 నుంచి రూ.60 పలుకుతోంది. ఇక మిగతా కూరగాయలన్నీ కిలో రూ.50 పైనే ఉన్నాయి. పచ్చి మిర్చి కిలో రూ.40 నుంచి రూ.50 పలుకుతోంది. క్యాప్సికమ్ కిలో రూ. 80, బిన్స్ కిలో రూ.80, బీరకాయ కిలో రూ.60, గోరు చిక్కుడు కిలో రూ.60 పలుకుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+