Hyderabad: ఆ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. గణేష్ నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం సెప్టెంబర్ 16న అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ఒకేసారి ఉండడంతో... ఊరేగింపును సెప్టెంబర్ 19కి వాయిదా వేశారు.
దీంతో హైదరాబాద్ లోని విద్యాసంస్థలకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. రెండో శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం హాలీడే ఉండనుంది. సెప్టెంబర్ 7న గణేష్ చతుర్థి సందర్భంగా హైదరాబాద్‌తో పాటు ఇతర తెలంగాణ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. గణేష్ విగ్రహాల నిమజ్జనం దృష్ట్యా సిటీ ట్రాఫిక్ పోలీసులు వివిధ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు.

వారంలో ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు వర్తిస్తాయని పేర్కొన్నారు. నిమజ్జనం సందర్బంగా పోలీసులు పలు సూచనలు చేశారు. గణేష్ విగ్రహ నిమజ్జనానికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు.
గణేష్ విగ్రహం తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్లు ఉండకూడదని స్పష్టం చేశారు. గణేశ్ విగ్రహం తీసుకెళ్లే వాహనంలో మద్యం లేదా ఏ ఇతర మత్తు పదార్థాలు ఉండరాదన్నారు.
గణేశ్ విగ్రహ నిమజ్జనం కోసం వచ్చే వారు కర్రలు, ఏ ఇతర ఆయుధాలు తీసుకురావొద్దని కోరారు.. ఒకవేళ జెండాలకు ఉపయోగించే కర్రలు రెండు అడుగుల పొడవు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. వెర్మిలియన్, కుంకుమ లేదా గులాల్ పాదచారులపై వేయకూడదన్నారు. అలా చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిమజ్జనం ఊరేగింపులో రాజకీయ, రెచ్చగొట్ట ప్రసంగాలు చేయకూడదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications