Hyderabad: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. పలు ప్రాంతాల్లో కరెంట్ కట్..!

శనివారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కరెంట్ కట్ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య నగరంలోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్తు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని విద్యుత్ శాఖ తెలిపింది. బగ్లింగంపల్లిలోని ప్రాంతాలలో నిర్దిష్ట సమయంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందని వివరించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ మరమ్మతుల కారణంగా విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతుందని ఆజామాబాద్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ (ఏడీఈ) విజయభాస్కర్‌ ప్రకటన చేశారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లోని అచ్యుతరెడ్డి మార్గ్, సీపీఎం కార్యాలయం, పోస్టాఫీసు ప్రాంతాల్లో 11కేవీ ఆజామాబాద్ ఫీడర్ వద్ద మరమ్మతు పనులపై ఉదయం 10:00 నుంచి 11:30 గంటల మధ్య విద్యుత్తు అంతరాయం ఏర్పడుతోంది. హైదరాబాద్‌లోని సంజీవయ్య నగర్‌లో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య విద్యుత్తు నిలిచిపోనుంది. సంజీవయ్య నగర్, తిలక్ నగర్, మీసేవ, శివాలయం ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం కలగనుంది.

There will be power outage in many parts of Hyderabad

వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ అంతటా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ ప్రయత్నిస్తోంది. పలు చోట్ల సమస్యలు రావడంతో వాటిని పరిష్కరించడానికి విద్యుత్ నిలివేయాల్సి వస్తుంది. నగరంలో దీర్ఘకాలికంగా, నోటిఫై చేయని విద్యుత్ కోతలను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసకుంది. జూన్‌లో హైదరాబాద్‌లో తొమ్మిది గంటల కరెంటు కోతపై మెహిదీపట్నంలోని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, ఆపరేషన్, మాసాబ్ ట్యాంక్ అసిస్టెంట్ ఇంజనీర్‌లకు షోకేస్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. అప్పటికప్పుడు విద్యుత్ పునరుద్ధరించినా.. పూర్తి మరమ్మత్తుల కోసం కాసేపు విద్యుత్ ను నిలిపివేస్తారు. అలాగే పలు మార్లు పైప్ లైన్న మరమ్మతుల కారణంగా కూడా పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతూ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+