కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు కోవర్ట్ రెడ్డిలు.. అన్న కాంగ్రెస్, తమ్ముడు బీజేపీః మంత్రి కేటీఆర్
కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోవర్ట్ బ్రదర్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుట్టలో వేసుకున్నారని ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బీజేపీ, కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి హాట్ కామెంట్స్ చేశారు.

డోంట్ కేర్
మిషన్ భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్ మెచ్చుకుందని కేటీఆర్ గుర్తుచేశారు. పథకాన్ని దేశం మొత్తం అమలు చేయాలని కేంద్రానికి సూచించిన విషయాన్ని ప్రస్తావించారు. మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. అయినా పట్టించుకోలేదని ఫైరయ్యారు.

మునుగోడు రూ.19 వేల కోట్లకు నో
ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడుతున్న మునుగోడు ప్రజల కోసం రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని కోరితే మోడీకి మనసు ఒప్పలేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డికి మాత్రం రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని విమర్శలు చేశారు. రాష్ట్రం కన్నా వ్యక్తే ముఖ్యం అని అర్థం అవుతోందని తెలిపారు.
ఒకరు బీజేపీ, మరొకరు కాంగ్రెస్
ఒకరెమో బీజేపీలోకి చేరారరని.. మరొకరు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నారట అని చెప్పారు. ఎలక్షన్ ముగిసిన తర్వాత తిరిగి వస్తడట. అన్న కాంగ్రెస్ ఎంపీ, తమ్ముడు బీజేపీ అభ్యర్థి అని పేర్కొన్నారు. వీరిద్దరూ కోమటిరెడ్డిలు కాదు.. కోవర్ట్ రెడ్డిలు. కోవర్ట్ ఆపరేషన్లు చేసేటోళ్లు అని హాట్ కామెంట్స్ చేశారు.
చిల్లర రాజకీయం
వీరు చేసే చిల్లర రాజకీయాన్ని మునుగోడు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. గల్లిగల్లీకి, ఇంటింటికీ ఈ విషయాన్ని చెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వారి నిజ రూపం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. జనాలకు అవేర్ నెస్ వచ్చి.. వారికి బుద్ది చెబుతారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications