కేఏ పాల్.. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఇటీవల రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్‌పై ఫోకస్ చేశారు. సిద్దిపేట జిల్లాలో జరిగిన దాడి తర్వాత.. రోజు వార్తల్లో ఉంటున్నారు. ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అమరవీరుల స్థూపం వద్దనివాళులు అర్పించారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై ఫైరయ్యారు.
తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కుటుంబంలో ఎవరూ బలికాలేదన్నారు. కానీ విద్యార్థులు బలిదానం అయ్యారని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలను ప్రజా శాంతి పార్టీ తరఫున ఆదుకుంటామని చెప్పారు. 1200 కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టంచేశారు. తమ పార్టీ అమరవీరుల కుటుంబాల కోసం పోరాటం చేస్తుందని తెలిపారు.
ఉచిత విద్య, వైద్యం అందిస్తామని వివరించారు. ప్రజాశాంతి పార్టీ తరఫున శ్రీకాంతాచారి తండ్రిని ఎమ్మెల్యేగా నిలబెడతామని పేర్కొన్నారు. శ్రీకాంతాచారి బలిదానం చేసుకున్న డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. రాష్ట్రం కోసం త్యాగాలు అమరుల కుటుంబాలు చేస్తే.. భోగాలు కేసీఆర్ కుటుంబానివా అని మండిపడ్డారు.

కేఏ పాల్‌పై ఇటీవల సిద్దిపేటలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పొలిటికల్‌గా బిజీ అయిపోయారు. సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఆయన చెంపచెల్ అనిపించాడు. కేఏ పాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ల పల్లి మండలం బస్వాపూర్‌లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళుతున్నారు.
పోలీసులు జక్కాపూర్ వద్ద అడ్డుకున్నారు. మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. కేఏ పాల్‌ను చెంప మీద కొట్టాడు. దాడి చేసిన యువకుడితో కేఏ పాల్ అనుచరులు గొడవకు దిగారు. ఆ తర్వాత డీజీపీని కలిసే ప్రయత్నం చేయడం.. హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ కూడా అయ్యారు. తర్వాత రోజు మీడియాతో మాట్లాడుతున్నారు.












Click it and Unblock the Notifications