హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెక్షన్ 8 ప్రకారం సచివాలయ కూల్చివేత అడ్డుకోండి.. గవర్నర్‌కు ఆల్ పార్టీ నేతల వినతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్తులను కూల్చడం ఏంటని అఖిలపక్ష నేతలు ప్రశ్నించారు. సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని వారు గవర్నర్‌ను కోరారు. సోమవారం రాజ్‌భవన్‌లో నరసింహన్‌తో నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సచివాలయం కూల్చివేత అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

సెక్షన్ 8 ప్రకారం ..
రాష్ట్రంలో సెక్షన్ 8 ప్రకారం ప్రభుత్వ ఆస్తులను కాపాడే హక్కు గవర్నర్‌కు ఉంటుందని వారు గుర్తుచేశారు. సచివాలయం కూల్చివేతపై గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని కోరారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసే వెసులుబాటు ఉన్నదని గుర్తుచేశారు. పాత నిర్మాణాలు కూల్చివేసి .. కొత్తవి కట్టడంతో ప్రజలపై ఆర్థికభారం పడుతుందని వివరించారు. అలా కాకుండా చూడాలని .. అసలే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని గుర్తుచేశారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో అప్పులు మరింత పెరిగి .. రాష్ట్రాభివృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

to stop sectretariat collapse.. all party leaders ask governer

సచివాలయం కూల్చివేతపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే తాము సుప్రీంకోర్టు తలుపుతడుతామని హెచ్చరించారు. సర్వోన్నత న్యాయస్థానంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశించారు. తెలంగాణ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాన్ని నిలిపివేసేందుకు న్యాయం పోరాటం చేస్తామన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు రమణ్, మాజీ మంత్రి డీకే అరుణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ వివేక్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఉన్నారు.

English summary
All-party leaders questioned the demolition of state assets. They asked the governor to block the demolition. The leaders met with Narasimhan in Raj Bhavan on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X