భూమా వారసురాలితో మంచు మనోజ్ వివాహబంధం..!!

ప్రముఖ నటుడు మంచు మనజ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కారు. టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు.

హైదరాబాద్: ప్రముఖ నటుడు మంచు మనోజ్‌ పెళ్లి పీటలు ఎక్కారు. భూమా కుటుంబ వారసురాలిని పెళ్లి చేసుకున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇది ఆయనకు రెండో వివాహం. 2016లో ప్రణతిని పెళ్లి చేేసుకున్నారు. అది విడాకులకు దారి తీసింది. 2019లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మౌనిక రెడ్డితో కొత్త జీవితాన్ని పంచుకున్నారు.

భూమా అఖిల చెల్లెలితో..

భూమా అఖిల చెల్లెలితో..

తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని త్వరలో పెళ్లి చేసుకోబోతోన్నాడంటూ ఇదివరకు వార్తలను నిజం చేశారాయన. మౌనిక రెడ్డితో మంచు మనోజ్ కొద్దిరోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నాడని, వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ఇదివరకు వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

కొత్త జీవితంపై..

కొత్త జీవితంపై..

గత ఏడాది మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డి కలిసి సికింద్రాబాద్ సీతాఫల్‌ మండిలోని వినాయకుడి ఆలయానికి వెళ్లారు. అప్పుడే వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే విషయం బయటికొచ్చింది. డిసెంబర్ లో కడపలోని అమీన్ పీర్ దర్గాను కూడా మనోజ్ సందర్శించారు. అక్కడా తన కొత్త జీవితం గురించి బయటపెట్టారు. ఈ సారి జంటగా కడప దర్గాను సందర్శిస్తాననీ పేర్కొన్నారు.

ఫిల్మ్ నగర్ నివాసంలో..

ఫిల్మ్ నగర్ నివాసంలో..

కొద్దిసేపటి కిందటే మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డి వివాహబంధంతో ఏకం అయ్యారు. వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు. మంచు- భూమా కుటుంబాలకు చెందిన అతి కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ వివాహ మహోత్సవానికి- మోహన్ బాబు దంపతులు, మంచు లక్ష్మీ.. ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.

భూమా కుటుంబంపై

భూమా కుటుంబంపై

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన దివంగత భూమా నాగిరెడ్డి-శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె మౌనిక రెడ్డి. గతంలో భూమా నాగిరెడ్డిని స్మరించుకుంటూ ట్వీట్ కూడా చేశారు మంచు మనోజ్. నాగిరెడ్డిని గొప్ప నాయకుడిగా అభివర్ణించారు. ఒక గొప్ప కొడుకు, భర్త, తండ్రి అంతకుమించి ఒక గొప్ప మనుసు ఉన్న వ్యక్తిగా కీర్తించారు. ఆయన అశీస్సులు ఎప్పుడు మనపైనే ఉంటాయంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.

కొత్త సినిమా

కొత్త సినిమా

కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు మంచు మనోజ్. 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు ఆయన నటించిన చివరి మూవీ. ఆ తరువాత 'అహం బ్రహ్మాస్మి అనే ప్రాజెక్ట్ ను ప్రకటించారు. అది పట్టాలెక్కనట్టే కనిపిస్తోంది. దీనితో వాట్ ద ఫిష్ అనే సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+