మోసం, కేసీఆర్ ట్విన్స్: రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు
సమయం దొరికితే చాలు విమర్శలు చేయడానికి.. ఇక సీఎం, ప్రతిపక్ష నేతల మధ్య అయితే చెప్పక్కర్లేదు. సీఎం కేసీఆర్‌పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. కేసీఆర్, మోసం కవలపిల్లలుగా కనిపిస్తారని విమర్శించారు. కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో రేవంత్ రెడ్డి ఆదివారం ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. గ్రామానికి కేసీఆర్ ఏం చేశాడో ప్రజలకు చూపిస్తాం అని చెప్పారు. కేసీఆర్ పాలనలో అత్యధికంగా దోపిడీకి గురైంది దళితులే అంటూ చురకలంటించారు.
సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో త్వరలో దళిత, గిరిజన దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. మూడుచింతలపల్లి దుస్థితిని సమాజానికి చూపిస్తామన్నారు. కేసీఆర్ వల్లే హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాజీమంత్రి ఈటల రాజేందర్ నిలబడ్డారని తెలిపారు. ఈటల రాజేందర్ అవినీతిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

టీఆర్ఎస్, బీజేపీవి కొనుగోలు రాజకీయాలని తప్పుబట్టారు. ఎస్సీలకు ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ అమలు చేయలేదని చెప్పారు. ఆయన ఎస్సీలకు ఎంత సేవ చేసినా తక్కువేనన్నారు. కేసీఆర్ అరాచకాలతోనే ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బయటికొచ్చారని తెలిపారు. పీసీసీ పూర్తిస్థాయి కమిటీకి ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. జగ్గారెడ్డి రాసిన లేఖలు తన దృష్టికి రాలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Recommended Video
హుజురాబాద్ బై పోల్ చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పార్టీలు భావిస్తోన్నాయి. ఈటల రాజేందర్‌కు అయితే జీవన్మరణ సమస్య.. టీఆర్ఎస్ కూడా ప్రతిష్టత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రేవంత్ కసరత్తు చేశారు. ఈటల మెజార్టీ తగ్గించినా.. నైతిక విజయం తమదేనని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications