హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

11 మంది అధికార ప్రతినిధులకు షోకాజ్ నోటీసులు, ఇదీ కారణం

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని అనుకుంటోంది. గీత దాటిన వారిపై చర్యలకు ఉప క్రమిస్తోంది. అయితే నిన్న హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇదీ కూడా జూమ్ మీటింగ్ ద్వారా జరిగింది. ఆ మీటింగ్‌కు దాదాపు 11 మంది అధికార ప్రతినిధులు హాజరుకాలేదు. దీనిపై పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

11 ప్రతినిధులు డుమ్మా..

11 ప్రతినిధులు డుమ్మా..

సమావేశానికి కేవలం ఇద్దరు అధికార ప్రతినిధులే హాజరు కావడంతో.. 11 మంది అధికార ప్రతినిధులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని అందులో స్పష్టం చేసింది. మునుగోడు ఓటమి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక ఫలితంపై సమీక్ష ఉంటుందని అంతా భావించారు. భారీగా అధికార ప్రతినిధులు ఈ జూమ్ మీటింగ్ కు డుమ్మా కొట్టారు.

జగ్గారెడ్డి గైర్హాజరు

జగ్గారెడ్డి గైర్హాజరు

జగ్గారెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా హాజరుకాలేదని తెలిసింది. జూమ్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటని బాహాటంగానే ప్రశ్నించారు. జగ్గారెడ్డి కూడా ఈ జూమ్ సమావేశానికి హాజరుకాలేదు.ఇదేమైనా కంపెనీయా ఇళ్లలో కూర్చుని చర్చించుకోవడానికి అంటూ జగ్గారెడ్డి నిలదీశారు. దీంతో చాలా మంది హాజరుకాలేదని తెలిసింది.

వివరణతో సంతృప్తి చెందితే..

వివరణతో సంతృప్తి చెందితే..


కీలక సమావేశానికి డమ్మా కొట్టిన వారికి పీసీసీ నోటీసులు ఇచ్చింది. వివరణ ఇవ్వాలని కోరింది. వివరణతో సంతృప్తితో చెందితే ఓకే.. లేదంటే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

జగ్గారెడ్డి ఫైర్

జగ్గారెడ్డి ఫైర్


అంతకుముందు గత నాలుగు నెలలుగా రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరపలేదని జగ్గారెడ్డి ఆరోపించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను సమన్వయం చేయకపోవడం పీసీసీ తప్పు అని స్పష్టం చేశారు. పాదయాత్రలో వన్ మ్యాన్ షోలా? అంటూ రేవంత్ తీరును కూడా తప్పుపట్టారు. అందరినీ కలుపుకోని పోవాలని సూచించారు. ఈ క్రమంలోనే షోకాజు నోటీసు జారీచేసింది.

English summary
tpcc issue showcause notice to 11 spokes persons for not attending zoom meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X