హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్ పాదయాత్రతో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు, ఇలా వెళ్లాలి..

|
Google Oneindia TeluguNews

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఇవాళ పిల్లలతో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రన్ కూడా చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆదివారం యాత్ర సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించనుంది. దీంతో నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

షాద్ నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు జడ్చర్ల నుంచి సిటీ వైపు వచ్చే వెహికల్స్‌ను ఒకే లేన్‌లో అనుమతిస్తారు. మరో లేన్‌లో వచ్చే వెహికల్స్ అమిత్​కాటన్ మిల్​, బూర్గుల క్రాస్​రోడ్, రాయికల్, సోలిపూర్ మీదుగా షాద్ నగర్‌కు వెళ్లాలి.శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకు బెంగళూరు నుంచి శంషాబాద్ వైపు వచ్చే వాహనాలను పాలమాకుల గ్రామం మీదుగా జేఐవీఏ ఆశ్రమం, గొల్లూరు క్రాస్ రోడ్, శంకరాపురం, సంగిగూడ జంక్షన్, పెద్ద గోల్కొండ టోల్ గేట్, బహదూర్​గూడ, గొల్లపల్లి, కిషన్​గూడ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

traffic diversion in the city due to congress leader rahul gandhi padayatra.

బోయిన్‌పల్లి నుంచి బాలానగర్ వైపు వెళ్లే వాహనాలు బోయిన్‌పల్లి జంక్షన్​, ఓల్డ్ ఎయిర్ పోర్టు, గౌతంనగర్, శోభన జంక్షన్, ఫతేనగర్ ఫ్లై ఓవర్ రోడ్ మీదుగా బాలానగర్ చేరుకోవాల్సి ఉంటుంది.బోయిన్ ​పల్లి, జీడిమెట్ల నుంచి కూకట్‌పల్లి వైపు వచ్చే వాహనాలు నర్సాపూర్ జంక్షన్, జింకలవాడ, సనత్ నగర్ రైల్వే స్టేషన్, భరత్ నగర్ మార్కెట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కూకట్‌పల్లి నుంచి బోయిన్‌పల్లి వైపు వెళ్లే వాహనాలు నర్సాపూర్ జంక్షన్, గుడెన్ మెట్ జంక్షన్, కుత్బుల్లాపూర్ వై జంక్షన్, సుచిత్రా సర్కిల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

మూసాపేట నుంచి ఇక్రిశాట్ వైపు వెళ్లే వెహికల్స్‌ను వై జంక్షన్ నుంచి ఇక్రిశాట్ వరకు రెండు లేన్లలో అనుమతిస్తారు. కూకట్‌పల్లి నుంచి ఇక్రిశాట్ వైపు వెళ్లే వెహికల్స్‌ రెండు లేన్లలో అలో చేస్తారు. జేఎన్టీయూ నుంచి ఇక్రిశాట్ వైపు వెహికల్స్‌ను ఒకే లేన్‌లో అనుమతిస్తారు. మరో 3 లేన్లలో పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర దృష్ట్యా ప్రయాణికులు సహకరించాలని పోలీసులు కోరారు.

English summary
traffic diversion in the city due to congress leader rahul gandhi padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X