Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ లో రాష్ట్రపతి - ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు ఇలా..!!

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి
లోక్ మంథన్ మహోత్సవంలో పాల్గొంటారు. రాజ్ భవన్ లో బస చేయనున్నారు. ఈ మంథన్ మహోత్సవంలో దేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా జానపద కళాకారులు హాజరవుతున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. రెండు రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు, రేపు హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ సాయంత్రం రాష్ట్రపత హైదరాబాద్ చేరుకోనున్నారు. రాజ్ భవన్ లో బస చేస్తారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. రేపు (శుక్రవారం) గిరిజన జాతర లోక్ మంథన్ మహోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. ఈ తరహా మహోత్సవం
తొలిసారి దక్షిణాది అయిన హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వీరితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొంటున్నారు.

Traffic Police issued an advisory in view of President Murmu s visit in Hyderabad for two days

మన దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే విధంగా లోక్ మంథన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన జానపద కళాకారులందరినీ ఒకే వేదిక మీదకు చేర్చి కళలను ప్రదర్శించనున్నారు. పదిహేను వందలకు మందికి పైగా జానపద కళాకారులు..
విదేశాల నుంచి కూడా జానపద కళాకారులు హాజరవుతున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు బేగంపేట ఫ్లైఓవర్‌, హెచ్‌పీఎ్‌స అవుట్‌గేట్‌, శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌, పీపీఎన్‌టీ ఫ్లైఓవర్‌, ఎయిర్‌పోర్టు వై జంక్షన్‌, మోనప్ప జంక్షన్‌, యశోద హాస్పిటల్‌, కత్రియా హోటల్‌, రాజ్‌భవన్‌రోడ్డు, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహం, ఖైరతాబాద్‌ ఫ్లైవోవర్‌, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగుతల్లి జంక్షన్‌, తెలుగుతల్లి వంతెన, కట్టమైసమ్మ ఆలయం, ఇక్బాల్‌ మినార్‌, పాత అంబేడ్కర్‌ విగ్రహం జంక్షన్‌, ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, అశోక్‌నగర్‌ జంక్షన్‌లో ట్రాఫిక్ మళ్లింపు చేయనునున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

అదే విధంగా రేపు (శుక్రవారం) ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు రాజ్‌భవన్‌ కుడివైపు నుంచి వీవీ విగ్రహం కుడివైపు, కేసీపీ అన్సారీ మంజిల్‌- తాజ్‌కృష్ణ1/7 రోడ్డు, 1/4 రోడ్డు, ఎన్‌ఎ్‌ఫసీఈఎల్‌ ఎస్‌ఎన్‌టీ, సాగర్‌ సొసైటీ, ఎన్టీఆర్‌ భవన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రోడ్డు నంబర్‌-45 జంక్షన్‌, కేబుల్‌బ్రిడ్జి, రోడ్డు నంబర్‌-65, జూబ్లీహిల్స్‌, ఎన్టీఆర్‌ భవన్‌, సాగర్‌ సొసైటీ, ఎస్‌ఎన్‌టీ- ఎన్‌ఎ్‌ఫసీఎ్‌స, పంజాగుట్ట వంతెన, ప్రజాభవన్‌, బేగంపేట వంతెన, హెచ్‌పీఎస్ అవుట్‌గేట్‌, శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌, విమానాశ్రయం వైజంక్షన్‌, బేగంపేట ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో ఈ జంక్షన్లలో కాసేపు ట్రాఫిక్‌ నిలిపివేయనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+