హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూ టర్న్ తిప్పలు: బెడిసికొట్టిన ట్రాఫిక్ పోలీసుల ప్లాన్, 15 మినిట్స్ లేటుగా

|
Google Oneindia TeluguNews

ట్రాఫిక్ దృష్ట్యా పోలీసులు తీసుకొచ్చిన యూ టర్న్ జనాలను ఇబ్బందులకు గురిచేస్తోంది. సిటీలో జూబ్లీహిల్స్‌ చుట్టూ 8 ప్రాంతాలను హెవీ ట్రాఫిక్‌ ఏరియాలుగా గుర్తించారు. ట్రాఫిక్‌ తగ్గించేందుకు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు చేశారు. ట్రాఫిక్ మళ్లింపుతో వాహనాల రద్దీ సమస్య ఏమో కానీ.. జూబ్లీహిల్స్‌ చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారని వాహనదారులు ఫైర్ అవుతున్నారు.

సీన్ రివర్స్..

సీన్ రివర్స్..


ట్రాఫిక్‌ డైవర్షన్‌తో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, ఫిలింనగర్‌, రోడ్‌నెంబర్ 45లో రద్దీ భారీగా తగ్గిపోయి వాహనదారులు ట్రాఫిక్‌ జామ్ లేకుండా సాగిపోవాలి. కానీ వాస్తవంగా ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ట్రాఫిక్‌ మళ్లింపుతో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, ఫిలింనగర్‌, రోడ్‌ నెంబర్ 45లో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్‌ మళ్లింపు చేసిన పోలీసులు డైవర్షన్ చేసిన చోట ఓ ఫ్లెక్సీ పెట్టారు. ముందుకు వెళ్లాక ఎటువైపు వెళ్తే తమ గమ్యస్థానం వస్తుందో చెప్పలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు మాములుగా లేవు. జూబ్లీహిల్స్‌ చుట్టూ చక్కర్లు కొట్టి ఎక్కడ నుంచి డైవర్షన్‌ తీసుకున్నారో మళ్లీ అక్కడికే వచ్చి చేరారు.

రూట్ మ్యాప్ లేకపోవడంతో..

రూట్ మ్యాప్ లేకపోవడంతో..


మరికొందరు ట్రాఫిక్ పోలీసుల దగ్గరికి వెళ్లి రూట్ మ్యాప్‌ గీయించుకుని మరీ వెళ్లారు. ఫిలింనగర్ జంక్షన్‌, జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 45 జంక్షన్‌లో సిగ్నల్స్‌ నిలిపివేశారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి రోడ్ నెంబర్ 45కి, ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్‌, ఫిలింనగర్ నుంచి చెక్‌పోస్ట్‌ వరకు నేరుగా వెళ్లొద్దని స్పష్టంచేశారు. చెక్ పోస్ట్ నుంచి కేబుల్‌ బ్రిడ్జికి వెళ్లాలంటే ఫిలిం నగర్ జంక్షన్‌ వద్ద యూటర్న్ తీసుకోవాలి. ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్‌కు వెళ్లేవారు జర్నలిస్ట్ కాలనీ వద్ద యూటర్న్ తీసుకోవాలి. ఫిలింనగర్ నుంచి చెక్ పోస్ట్ వచ్చేవారు కేబుల్ బ్రిడ్జి ఫ్లై ఓవర్ కింద యూటర్న్‌ తీసుకోవాలని సూచించారు.

 15 మినిట్స్ లేట్

15 మినిట్స్ లేట్


చెక్‌ పోస్ట్‌ నుంచి ఫిలింనగర్ వెళ్లే వారు ఫిలింనగర్ జంక్షన్‌ నుంచి కుడివైపున వెళ్లాలట. చెక్‌పోస్ట్‌ నుంచి జర్నలిస్ట్‌ కాలనీకి వెళ్లేవారు ఫిలింనగర్ జంక్షన్ దగ్గర యూటర్న్‌ తీసుకోవాల్సి ఉంటుంది. బంజారాహిల్స్‌ నుంచి చెక్‌పోస్ట్‌ వచ్చేవారు ఫిలింనగర్ జంక్షన్‌ దగ్గర రైట్ తీసుకుని భవన్స్ దగ్గర యూటర్న్ తీసుకోవాలి. ఇదివరకటి రూట్‌లో వెళితే నిమిషంలో చేరుకునే గమ్యస్థానానికి యూటర్న్ వల్ల 15 నిమిషాలు ఆలస్యం అవుతుంది. దీనిపై ప్యాసెంజర్స్ ఆగ్రహాంతో ఉన్నారు.

English summary
traffic police u-turn policy has failure in hyderabad. people are faced problem while going to destination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X