Hyderabad: శుక్రవారం హైదరాబాద్‍లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షాలు..

రంజాన్ చివరి శుక్రవారం దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. శుక్రవారం పాతబస్తీలోని చారిత్రక మక్కా మసీదు పరిసర ప్రాంతాలు, సికింద్రాబాద్‌లోని జమా-ఎ-మసీదు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.చార్మినార్-మదీనా, చార్మినార్-ముర్గీ చౌక్, చార్మినార్ -రాజేష్ మెడికల్ హాల్, శాలిబండ మధ్య ప్రధాన రహదారులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు.

చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వివిధ పాయింట్ల వద్ద మళ్లించనున్నారు. నయాపూల్ వైపు నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా హిమ్మత్‌పురా, చౌక్ మైదాన్ ఖాన్, మోతిగల్లి, ఈతేబార్ చౌక్, సెహర్-ఎ-బాటిల్ కమాన్, లక్కడ్ కోటే వద్ద ట్రాఫిక్ మళ్లించనున్నారు. మక్కా మసీదుకు వచ్చే భక్తుల వాహనాలకు ఏడు వేర్వేరు చోట్ల పార్కింగ్‌ ఏర్పాటు చేస్తామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

 traffic

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు మక్కా మసీదులో జుమ్మత్-ఉల్-విదా ప్రార్థనలు చేయడానికి వస్తారు. మసీదు సమీపంలోని చార్మినార్‌ను ఆనుకుని ఉన్న రోడ్లపై ప్రజలు నమాజ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం మక్కా మసీదులో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తారు.

సికింద్రాబాద్ జామా-ఎ-మసీదు పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తామని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్‌లోని సుభాష్ రోడ్డు (మహంకాళి PS, MG రోడ్డులోని రాంగోపాల్‌పేట్ రోడ్ జంక్షన్ మధ్య) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. ప్రార్థనల దృష్ట్యా ట్రాఫిక్‌ను కొన్ని పాయింట్ల వద్ద మళ్లిస్తారు. ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. అలాగే ముస్లిం సోదరులు ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+