Hyderabad: బుధవారం ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షాలు..
బుధవారం ఉదయం హైదరబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. సైక్లింగ్ ఓట్, వాకథాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యలం 2023 ఆక్టోబర్ 4వ తేదీన కేబుల్ బ్రిడ్జి చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కేబుల్ బ్రిడ్జ్ - ఇనార్బిట్ మాల్ - మై హోమ్ అబ్రా - ఐటిసి కోహినూర్ - కేబుల్ బ్రిడ్జ్ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అమలులో ఉంటాయి.
పలు మార్గాల్లో కూడా ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్ ను కావూరి హిల్స్ నుంచి మాదాపూర్పోలీస్ స్టేషన్ - COD జంక్షన్ సైబర్ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా, బయో డైవర్సిటీ పార్క్ జంక్షన్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ వైపు వచ్చే ట్రాఫిక్ ను సైబర్ టవర్స్ - COD , జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 వైపు మళ్లించనున్నారు.

అలాగే మీనాక్షి జంక్షన్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ వైపు వచ్చే ట్రాఫిక్ IKEA రోటరీ - లెఫ్ట్ టర్న్ - సైబర్ టవర్స్ - COD - రోడ్ నంబర్ 45 నుండి మళ్లిస్తారు. సిఓడి నుంచి దుర్గంచెరువు, ఐటిసి కోహినూర్ నుంచి ఐకియా రోటరీ, ఐకియా రోటరీ నుంచి ఐటిసి కోహినూర్ వైపు భారీ వాహనాలను అనుమతించమని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు సిటీలో చాలా మంది ట్రాఫిక్ నిబంధనలు పాటించండం లేదు.
లెఫ్ట్ బ్లాక్ చేయడం, రాంగ్ రూట్లో వెళ్లడం, ట్రిఫుల్ రైడింగ్ చేస్తున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల క్రితం మాట్లాడారు. ఇండియాలో సివిక్ సెన్స్ లేదన్నారు. ఎవరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించరని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications