Hyderabad: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు..!

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. సైబర్ టవర్స్ నుంచి యశోద హాస్పిటల్స్ వరకు రోడ్డు వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఓవర్ ద బ్రిడ్జి (RoB) నిర్మాణం కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

సైబర్ టవర్స్, 100 ఫీట్ జంక్షన్, కొత్తగూడ నుంచి జేఎన్‌టీయూ, మూసాపేట్ వైపు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు. టోడీ కాంపౌండ్ నుంచి 100 ఫీట్ జంక్షన్ మీదుగా జేఎన్టీయూ, మూసాపేట్ వైపు వెళ్లే ట్రాఫిక్ పర్వతనగర్ జంక్షన్ వద్ద మళ్లింపు తీసుకొని ఖైత్లాపూర్ వంతెన మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ఐకియా, సైబర్ గేట్‌వే మరియు COD జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ మీదుగా జేఎన్టీయీ వైపు వెళ్లే ప్రయాణికులు నేరుగా JNTU వైపు ప్రయాణాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు.

Traffic restrictions will be imposed on the road from Cyber Towers to Yashoda Hospitals

జేఎన్టీయు నుంచి సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ కింద ప్రయాణించే ట్రాఫిక్ N-గ్రాండ్ హోటల్ వద్ద టర్న్ తీసుకోవాలని సూచించారు. N-కన్వెన్షన్ మీదుగా వెళ్లి, జైన్ ఎన్‌క్లేవ్ వద్ద కుడివైపునకు వెళ్లి, JNTU వైపు ROB ఫ్లైఓవర్‌లో విలీనం చేయడానికి యశోద హాస్పిటల్ వెనుక రహదారిని ఉపయోగించాలని కోరారు. అటు అంబర్ పేట ప్లై ఓవర్ నిర్మాణం కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 17న నిమజ్జనం సందర్భంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

ట్యాంక్ బాండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. నిమజ్జనం చూడడానికి వచ్చ జనాలకు పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించే అవకాశం ఉంది. నిమజ్జనం సందర్భంగా పోలీసులు పలు సూచనలు చేశారు. గణేష్ విగ్రహ నిమజ్జనానికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతించనున్నారు. గణేశ్ విగ్రహం తీసుకెళ్లే వాహనంలో మద్యం లేదా ఏ ఇతర మత్తు పదార్థాలు ఉండరాదని పోలీసులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+