గ్రేట్: అండర్-19 జట్టుకు తెలుగుమ్మాయి ఎంపిక

తెలంగాణకు చెందిన అమ్మాయి త్రిష అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈమె స్వస్థలం భద్రాచలం. భారత అండర్-19 అమ్మాయిల జట్టు న్యూజిలాండ్‌తో జరిగే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. 15 మంది సభ్యుల అండర్-19 జట్టులో బీసీసీఐ సెలెక్టర్లు త్రిషకు చోటు కల్పించారు.

trisha selected under-19 team

త్రిష ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ప్రతిభ చాటింది. జిల్లా స్థాయి అండర్-16 జట్టుకు ఎంపికైంది. 12 ఏళ్ల వయసులో అండర్-19 జట్టుకు ఆడింది. 12 ఏళ్ల వయసులో హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికై చక్కగా ప్లే చేసింది. చిన్న వయసులో బీసీసీఐ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును కూడా గెలుచుకుంది.

trisha selected under-19 team

త్రిష లెగ్ స్పిన్నర్. అలాగే బ్యాటింగ్‌లో చక్కగా ఆడుతుంది. పవర్ హిట్టింగ్‌తో రాణిస్తూ ఆల్ రౌండర్‌గా ఎదుగుతోంది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డు త్రిష పేరుతో ఉందట.ఇప్పుడు అండర్ -19 నెక్ట్స్.. టీమిండియా ఉమెన్ జట్టులో స్థానం సంపాదించడమే. ఆ దిశగా కూడా అడుగులు వేస్తానని అంటోంది. ఆమె ప్రతిభను చూసినవారంతా.. కచ్చితంగా మహిళల జట్టులో ఆడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+