Allu Arjun: ఆ క్రేజీ డైరెక్టర్‌తో బన్నీ మరో పాన్‌ఇండియా మూవీ..!

Allu Arjun:బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. పుష్ప-2తో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్ వచ్చే ఏడాదిలో మరో క్రేజీ కాంబోతో ముందుకు రానున్నాడు. పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన పుష్పరాజ్.. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీకి సైన్ చేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.. ఆ క్రేజీ డైరెక్టర్ ఎవరు..?

పుష్ప-2 చిత్రం సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నది ఎవరనుకుంటున్నారా.. మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అవును త్రివిక్రమ్ అల్లు అర్జున్‌ కాంబోలో మూడు క్రేజీ మూవీస్ వచ్చాయి. సన్‌ ఆఫ్ సత్యమూర్తి, జులాయి, అలవైకుంఠపురం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయ్యాయి.

Allu Arjun Trivikram Srinivas

ఇక తాజాగా నాల్గవ సారి ఈ కాంబినేషన్ మరో పాన్‌ ఇండియా హిట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కొత్త చిత్రంకు సంబంధించిన పవర్‌ఫుల్ స్టోరీలైన్ త్రివిక్రమ్ బన్నీకి వినిపించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ స్టోరీని త్రివిక్రమ్ రిజిస్టర్ కూడా చేసినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ఇప్పటికే పలుమార్లు త్రివిక్రమ్-బన్నీలు డిస్కషన్స్ కూడా చేశారని సమాచారం. ఇది సెట్స్‌ పైకి వెళితే త్రివిక్రమ్‌కు డైరెక్టర్‌గా తొలి పాన్ ఇండియా చిత్రం అవుతుంది.

అన్నీ సవ్యంగా సాగితే త్రివిక్రమ్ బన్నీల మూవీ డిసెంబర్ 2023లో చిత్రీకరణ ప్రారంభం అవుతుందని సమాచారం. ఇక రెగ్యులర్ షూటింగ్ పుష్ప-2 విడుదల తర్వాత జరుగుతుందని ఫిలింనగర్ టాక్.త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే పుష్న ది రైజ్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ కథలు ఎంచుకోవడంలో మరింత జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు చాలా కథలు వినిపిస్తున్నట్లు టాక్.

Allu Arjun Trivikram Srinivas

ఇదిలా ఉంటే ఆదిత్య ధార్ డైరెక్షన్‌లో అశ్వథ్థామ చిత్రంపై బన్నీతో టాక్స్ నడుస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే ఒక కథను విన్న తర్వాత తనకు ఏమేరకు సూట్ అవుతుందనేదానిపై బన్నీ ఆలోచిస్తున్నారు. అంతా ఓకే అనుకున్నాకే కథకు సైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక త్రివిక్రమ్ - బన్నీల కాంబోలో వచ్చే చిత్రం ఇండియన్ సినిమాలో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2తో బిజీగా ఉన్నాడు.ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఆ వెంటనే భూషణ్ కుమార్ నిర్మాతగా అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్షన్‌లో ఒక ప్రాజెక్టుకు బన్నీ సైన్ చేశాడు. ప్రస్తుతం సందీప్ వంగా రనబీర్ కపూర్‌తో యానిమల్, ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రాలను డైరెక్ట్ చేయనున్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని 2024లో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+