టీఎస్ఆర్టీసీ ఎండీగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్: కేసీఆర్‌కు కృతజ్ఞతలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఆర్ఆర్టీసీ) చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ప్రస్తుతం గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనను ఆర్టీసీ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే గోవర్ధన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సిరికొండ మండలం రావుట్లలో జన్మించిన గోవర్ధన్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. టీఆర్ఎస్ పార్టీ తరపున 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గోవర్దన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో ఆర్మూర్ నుంచి, 2004లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

1973లో పోలీస్ పటేల్‌గా పనిచేసి, 1981లో చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1986లో సిరికొండ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1986లో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ అయ్యారు. 1994లో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి ఓడిపోయారు.
ఇది ఇలావుండగా, టీఆర్ఎస్ఆర్టీసీ ఇటీవలే ఎండీని నియమించిన విషయం తెలిసిందే. సైబరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ అభివృద్ధికి ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండ్రోజుల క్రితం ఆయన సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులు ప్రయాణించారు. అంతేగాక, బస్టాండ్లలో వసతులను పరిశీలించి సమస్యలు తెలుసుకుంటున్నారు.
తాజా, ఆర్టీసీ బస్సులపై ఆశ్లీల పోస్టర్లను నిషేధించారు. ఈ మేరకు సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ బస్సులపై అసౌకర్యంగా, అభ్యంతరకరంగా ఉండే పోస్టర్లను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
అభిరామ్ అనే ఓ జర్నలిస్టు.. ఆర్టీసీ బస్సులపై అంటించే ఆశ్లీల పోస్టర్ల విషయాన్ని సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. నెటిజన్ ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ స్పందించారు. ఆర్టీసీ బస్సులపై ఇలాంటి పోస్టర్లు లేకుండా ఆర్టీసీ ఎండీగా చర్యలు తీసుకుంటానని సజ్జనార్ ప్రకటించారు. ఇచ్చిన ప్రకటన మేరకు ఆర్టీసీ బస్సులపై ఆశ్లీల ఫోటోలను నిషేధిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications